వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలున్నాయన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వివేకా మరణ సమాచారం తెలుసుకున్న ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ... వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందన్నారు. ఆ తర్వాత మాత్రం ఇది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామన్నారు.

వివేకా మరణంపై లోతైన దర్యాప్తు జరపాలని వైసీపీ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఆయన మరణం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాన్ని విజయసాయి వ్యక్తం చేశారు. జగన్ కొద్దిసేపట్లో పులివెందుల చేరుకుంటారని తెలిపారు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఏ విషం చెప్పలేమని విజయసాయి చెప్పారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన తెలిపారు. 

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం