కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వైఎస్ వివేకానందరెడ్డి సహజ మరణం కాదని ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఇప్పటికే రాజకీయ రంగు పులుముకొంది.

కడప అడిషనల్ ఎస్పీ బి. లక్ష్మీనారాయణ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఘటన స్థలాన్ని డాగ్ స్వ్కాడ్  పరిశీలించింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిని కూడ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు కూడ సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించనున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం