మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వైఎస్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పులివెందులతో పాటు కడప జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వివేకా.. అన్న రాజశేఖర్‌రెడ్డికి అన్ని అంశాల్లో కుడిభుజంలా వ్యవహరించారు.

వైఎస్ అడుగుజాడల్లో రాజకీయంగా ఓనమాలు దిద్దిన ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా సేవలందించారు. 1989లో తొలిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానందరెడ్డి 1994 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1999, 2004లో కడప లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో లక్షా 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది వివేకానందరెడ్డి సంచలనం సృష్టించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.

కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు వివేకా ఆయనతో విభేదించారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనూ కొనసాగారు. ఆ సమయంలో జగన్‌ కుటుంబానికి దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత కొద్దికాలానికి బాబాయ్-అబ్బాయ్ కలిసిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన పార్టీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కడప జిల్లాలో లింగాల కాలువను వివేకానందరెడ్డి డిజైన్ చేశారు.  

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం