అమరావతి: తిరుపతి నుండే టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రతిసారి ఎన్నికల క్యాంపెయిన్‌ను టీడీపీ  తిరుపతి నుండే ప్రారంభిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడి నుండే  ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తిరుపతి నుండే ఎన్నికల ప్రచారానికి  శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత 9 మాసాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరుపతి నుండి  ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.దీంతో  ఆ  ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పార్టీ ఏర్పాటు చేసిన 9 మాసాల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత ప్రతి ఎన్నికల సమయంలో కూడ టీడీపీ ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు తిరుపతి నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

2014 ఎన్నికలకు కూడ చంద్రబాబునాయుడు తిరుపతి నుండే  ప్రచారాన్ని ప్రారంభించారు. తిరుపతి నుండి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తమకు కలిసివస్తోందని టీడీపీ నేతలు చెబుతారు.

తమ ఇష్టదైవం వెంకటేశ్వరస్వామి అని చంద్రబాబు ప్రకటించారు. వెంకన్న దర్శనం చేసుకొని ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే  కొన్ని ఎన్నికల్లో తిరుపతి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినా కూడ ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ఘటనలు కూడ లేకపోలేదు.

అయినా కూడ టీడీపీ తిరుపతి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయాన్ని మాత్రం మానుకోలేదు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబునాయుడు తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.