Asianet News TeluguAsianet News Telugu

సిక్కోలు సెంటిమెంట్ గెలిచింది: జగన్ కు సిఎం కుర్చీ దక్కింది

 శ్రీకాకుళం జిల్లాలో వైసిపి 8 స్థానాలను దక్కించుకుంది. రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చింది. దీంతో సెంటిమెంట్ నిజమైందని అంటున్నారు. 

Srikakulam sentiment wins in AP Election
Author
Srikakulam, First Published May 25, 2019, 10:33 AM IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకునే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ వాస్తవ రూపం ధరించింది. దాంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు.

 శ్రీకాకుళం జిల్లాలో వైసిపి 8 స్థానాలను దక్కించుకుంది. రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చింది. దీంతో సెంటిమెంట్ నిజమైందని అంటున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలోని 12 సీట్లలో 1999లో తెలుగుదేశం పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. దీంతో చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. 

అప్పడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లోనూ జిల్లాలో కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో 10 స్థానాలకుగాను 7 స్థానాలను టీడీపీ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios