భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని..భార్య కూడా పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. చివరికి ప్రియుడి చేతిలో ఆమె భర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా పొన్నూరు వీవర్స్ కాలనీకి చెందిన సత్యంశెట్టి శ్రీనివాసరావు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

నెలలో కొన్ని రోజుల పాటు నైట్ డ్యూటీకి వెళ్లేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకి వట్టిచెరుకూరుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై శ్రీనివాసరావుకు, అతడి భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అయితే వీరి మనస్పర్థలు పసిగట్టిన పక్కింట్లో ఉండే కారు డ్రైవర్ ఆకుల నరేశ్.. శ్రీనివాసరావు భార్య పార్వతిని లోబరచుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తన స్నేహితులతో వచ్చి నరేశ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీనిని అవమానంగా భావించిన నరేశ్.. శ్రీనివాసరావును చంపాలని నిర్ణయించుకున్నాడు.

తన స్నేహితులైన తోటి కారు డ్రైవర్లు బత్తుల సుబ్రమణ్యం, వలిశెట్టి గోపీలతో మాట్లాడి పథకం పన్నాడు. ప్లాన్‌లో భాగంగా దసరా పండుగ రోజు ముందు రాత్రి వారందరూ నరేశ్ ఇంటిలో నిద్రించారు.. పండుగ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు డ్యూటీకి వెళుతున్న శ్రీనివాసరావును గమనించారు.

ఇదే సరైన సమయంగా భావించిన నరేశ్, సుబ్రమణ్యం, గోపి కలిసి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వీధిలైట్లు ఆర్పేసి ఇనుపరాడ్డు, ఇతర మారణాయుధాలతో శ్రీనివాసరావు తలపై బలంగా కొట్టారు. దీంతో అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. హత్య జరిగిన రోజు నరేశ్ ఇంట్లో లేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది..

శ్రీనివాసరావు హత్యకు కారణం అతడేనని భావించి పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని హత్య చేసింది తానేనని స్థానిక వీఆర్వో వద్ద నరేశ్ అంగీకరించాడు. నరేశ్ అతనికి సహకరించిన సుబ్రమణ్యం, గోపీలను పోలీసులు అరెస్ట్ చేసి.. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

విశాఖలో మూడేళ్ల చిన్నారి అలేఖ్య హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

భార్యని కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం.. ఓనర్ హత్య

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....