Asianet News TeluguAsianet News Telugu

భార్యని కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం.. ఓనర్ హత్య

ఆమె ముఖంపై బలంగా కొట్టి, పక్కన ఉన్న వస్త్రంతో ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కో ల్పోయింది.

police revealed women murder mistery in vijayawada
Author
Hyderabad, First Published Sep 21, 2018, 12:07 PM IST

భార్య, బిడ్డలకు దూరంగా ఉంటూ.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు. విడిగా ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీనం సాగించాడు. చిన్నపాటి వివాదం ఇంటి ఓనర్ తో తెలెత్తడంతో ఆమెను హత్యచేసి, బంగారం, నగలు చోరీ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..పాయకాపురం రాధానగర్‌లో కారుమూడి అంజలి రెండంతస్తుల ఇంట్లో ఒంటరిగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేసేది. కింద పోర్షన్లను అద్దెకు ఇచ్చింది. ఈమె కుమారుడు, కుమార్తె మరోచోట వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రాయని నాగసురేంద్ర భార్యాపిల్లలను జూపూడిలోని అత్తింటి వద్ద వదిలిపెట్టి విజయవాడలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సూరేపల్లి రూప భర్త, పిల్లల్ని వదిలి ఇక్కడికి వచ్చేసింది. నాగ సురేంద్ర, రూప కలిసి అంజలి ఇంట్లో ఏడాది నుంచి ఓ పోర్షన్‌లో సహజీవనం చేస్తున్నారు.
 
వారిద్దరూ కొద్ది నెలల క్రితం అంజలి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. దీన్ని తీర్చ కపోవడంతో అంజలికి, వారికి వివాదం జరుగు తోంది. దీనికితోడు నీళ్ల మోటారు వద్ద వివాదాలు జరిగేవి. ఈ నెల 5న అంజలి రాత్రి 10 గంటలకు కింది అంతస్తులో ఉంటున్న వారితో మాట్లాడి పై అంతస్తులో నాగసురేంద్ర, రూప వద్దకు వెళ్లింది. వారితో మాట్లాడుతూ మరో వ్యక్తిని వివాహం చేసు కుని స్థిరపడమని రూపకు సూచించింది. ఇది నాగ సురేంద్రకు ఆగ్రహం తెప్పించింది. కుర్చీలో కూర్చు న్న ఆమె ముఖంపై బలంగా కొట్టి, పక్కన ఉన్న వస్త్రంతో ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కో ల్పోయింది.
 
అంజలి ముక్కు నుంచి కారిన రక్తపు మరకలను శుభ్రం చేసి, కాళ్లు పట్టుకుని లాక్కెళ్లి ఆమె పోర్షన్‌లో పడేద్దామనుకున్నాడు. వీలు కాక పోవడంతో రూప సాయంతో రాత్రి 12 గంటల తర్వాత అంజలి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆమె పడక గదిలో మంచంపై పడేశాడు. తర్వాత గదిలోని కబో ర్డులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దొంగి లిం చాడు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు నాగ సురేంద్ర, రూపను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios