విశాఖపట్టణం: విశాఖపట్టణంలో మూడేళ్ల చిన్నారి అలేఖ్యను గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేశారు.  కుటుంబ కలహాల కారణంగానే చిన్నారిని  హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

విశాఖ జిల్లాలోని దువ్వాడ సమీపంలోని పొదల్లో  అలేఖ్య మృతదేహన్ని స్థానికులు గుర్తించారు.  దీంతో పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మృతదేహన్ని అలేఖ్యదిగా గుర్తించారు.

అలేఖ్య కన్పించడం లేదని దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో  అలేఖ్య తల్లి  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఇదే సమయంలోనే అలేఖ్య మృతదేహం  మంగళవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. అయితే అలేఖ్యను కుటుంబ కలహాల కారణంగానే  హత్య చేసినట్టు పోలీసులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  అయితే  మూడేళ్ల చిన్నారి  అలేఖ్యను  హత్య చేసేందుకు గల కారణాలు  మాత్రం తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.


అలేఖ్య తండ్రి  రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.  కొంత కాలం క్రితం నుండి  రాము మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో  రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. 

సోమవారం నుండి అలేఖ్య కన్పించడం లేదు. మంగళవారం ఉదయం అలేఖ్య  డెడ్‌బాడీ లభించింది. దీంతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందా.. ఇంకా  ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.