తెలుగుదేశం నేతలకు నారా లేకేష్ ఏమన్నా పూనాడా అన్న అనుమానాలు వస్తున్నాయి అందరిలోనూ. ఎందుకంటే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెలుగు మహిళలు కొందరు చంద్రబాబునాయుడుకు జోహార్లు చెప్పేసారు.

తెలుగుదేశం నేతలకు నారా లేకేష్ ఏమన్నా పూనాడా అన్న అనుమానాలు వస్తున్నాయి అందరిలోనూ. ఎందుకంటే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెలుగు మహిళలు కొందరు చంద్రబాబునాయుడుకు జోహార్లు చెప్పేసారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ ఫొటో పెట్టి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర రహే అని నినాదాలు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ అదే ఉత్సాహంలో ఓ మహిళా నేత జోహార్ చంద్రబాబునాయుడు అని గట్టిగా అరవగానే మిగిలిన నేతలు కూడా ఏమీ ఆలోచించకుడా చంద్రబాబుకు జోహార్లు అంటూ గట్టిగా నినాదాలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. వీరి నినాదాలు విన్నవారు వీళ్ళందరినీ లోకేష్ ఏమన్నా పూనాడా అని అనుకున్నారు.