అమరావతి:రక్తపు మడుగులో వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాం ఉంటే గుండెపోటుతో  ఆయన మరణించాడని ఎందుకు చెప్పారని టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. 

టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.వివేకానంద రెడ్డి చనిపోతే డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి ఇంట్లో రక్తపు మరకలను తుడిచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

వివేకానందరెడ్డి గుండె ఆగిపోయి చనిపోయారని ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎందుకు చిత్రీకరించారో చెప్పాలన్నారు.వివేకానందరెడ్డి చనిపోతే జగన్ ఎందుకు స్పందించలేదో  చెప్పాలన్నారు.

వైఎస్ఆర్ బతికున్న సమయంలోనే వైఎస్ జగన్‌కు, వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య  కడప ఎంపీ సీటు విషయమై గొడవలు జరగలేదా బుద్దా వెంకన్న ప్రశ్నించారు.వివేకానందరెడ్డి మరణం విషయమై తెలంగాణ పోలీసులతో మంతనాలు జరిపారని వెంకన్న ఆరోపించారు. సీబీఐ, లేదా మీ జేబు సంస్థగా ఉన్న తెలంగాణ పోలీసులతో దర్యాప్తు చేయించాలని కోరుకొన్నారని విమర్శించారు.

లోటస్ పాండ్‌లో కూర్చొని జగన్ శవరాజకీయాలకు తెరలేపారని బుద్దా వెంకన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి  మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. వైఎస్ కుటుంబంలోనే వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు ఉండి ఉంటారని ప్రజలు నమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

వివేకానందరెడ్డికి ఇతర పార్టీలతో కూడ ఎలాంటి గొడవలు లేవన్నారు. వివేకాకు జగన్ కుటుంబంతోనే గొడవలున్నాయని ఆయన ఆరోపించారు. బాబు సీఎం కాకముందు కడప జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు అనుమానాలు ఉన్నాయన్నారు.

వివేకా హత్యను అడ్డుపెట్టుకొని జగన్‌కు వత్తాసు పలికే కేంద్రం వద్దకు తన మనుషులను పంపి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రజలు అనుమానిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడ బీహార్ రాష్ట్రంలో జరుగుతుంటాయన్నారు. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందన్నారు.  వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం లోటస్‌పాండ్ నుండి వైఎస్ వివేకానందరెడ్డి కళ్ల నీళ్లు పెట్టుకొంటూ బయటకు వచ్చిన విషయం వాస్తవం కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య: పులివెందులకు అమిత్ గార్గ్ టీం

వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం