కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి  విచారణ చేసేందుకు సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ పులివెందుల వెళ్లనున్నారు. ఐదు ప్రత్యేక బృందాలన్నీ కూడ సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ నేతృత్వంలో పనిచేయనున్నాయి.

ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కడప అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించిన బృందాలన్నీ కూడ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో పనిచేస్తాయని డీజీపీ ప్రకటించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఆరోపణలు  చేశారు.

తొలుత వైఎస్ వివేకానంద రెడ్డిది అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు. ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం