Asianet News TeluguAsianet News Telugu

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ వివాదం నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ షోరూంలో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. వీటిని శాసనసభ ఫర్నిచర్‌గా గుర్తించిన అధికారులు అనంతరం షోరూం నుంచి తరలించారు

ap assembly officials raids on tdp leader kodela siva prasad hero honda showroom
Author
Guntur, First Published Aug 26, 2019, 8:45 PM IST

అసెంబ్లీ ఫర్నీచర్ వివాదం నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ షోరూంలో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. వీటిని శాసనసభ ఫర్నిచర్‌గా గుర్తించిన అధికారులు అనంతరం షోరూం నుంచి తరలించారు.

మూడు రోజుల క్రితం కోడెల షోరూంలో ఇదే విషయమై అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పై అంతస్తులో సోదాలు నిర్వహించేందుకు షోరూం సిబ్బంది అనుమతించలేదు.

మరోవైపు కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

స్పీకర్ గా ఉన్న సమయంలో  హైద్రాబాద్ నుండి ఫర్నీచర్ ను అమరావతికి తరలించే సమయంలో కొంత ఫర్నీచర్ ను తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకొన్నట్టుగా  కోడెల శివప్రసాదరావు ఒప్పుకొన్నారు.

ఫర్నీచర్ ను దారి మళ్లించారని అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ నెల 23వ తేదీన తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన తనయుడు శివరామ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios