అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై మరో కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను దారి మళ్లించారని కేసు నమోదైంది.

గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై మరో కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దారి మళ్లించారని విషయమై అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఉన్న సమయంలో హైద్రాబాద్ నుండి ఫర్నీచర్ ను తరలించే సమయంలో తన క్యాంప్ కార్యాలయంలో కొంత ఫర్నీచర్ ను ఉపయోగించుకొన్నట్టుగా కోడెల ప్రకటించారు.
ఈ ఫర్నీచర్ విషయమై అసెంబ్లీ అధికారులకు తాను కూడ లేఖ రాసినట్టుగా కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కోడెల శివరామ్ షోరూమ్‌లో అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేశారు.
తమ వద్ద ఉన్న జాబితాతో పాటు కోడెల శివప్రసాదరావు షోరూమ్ లో ఉన్న ఫర్నీచర్ విషయమై లెక్కలు తీశారు. ఇవాళ అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈశ్వరరావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దారి మళ్లించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 23వ తేదీన రాత్రి కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు.
సంబంధిత వార్తలు
ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌లు అప్పగింత
శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...
నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?
కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు