Asianet News TeluguAsianet News Telugu

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

తనపై జరిగిన దాడి విషయంలో వైసీపీ అధినేత జగన్ పోలీసులకు ఎందుకు వాంగ్మూలం ఇవ్వడని ప్రశ్నించారు ఏపీ మంత్రి పితాని సత్యానారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై విచారణ జరుగుతోందన్నారు

pithani satyanarayana comments on ys jagan
Author
Tirumala, First Published Oct 28, 2018, 11:56 AM IST

తనపై జరిగిన దాడి విషయంలో వైసీపీ అధినేత జగన్ పోలీసులకు ఎందుకు వాంగ్మూలం ఇవ్వడని ప్రశ్నించారు ఏపీ మంత్రి పితాని సత్యానారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై విచారణ జరుగుతోందన్నారు..

ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీలపై వైసీపీ నేతల ఆరోపణలు సరికాదన్నారు. జగన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేలా చేయాల్సిందిగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

వైసీపీ చీఫ్‌పై దాడి చేసిన వారిని.. దీనికి వ్యూహరచన చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని పితాని హెచ్చరించారు. కాగా, విశాఖ విమానాశ్రయంలో దాడి అనంతరం హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను కలిసి వాంగ్మూలం తీసుకునేందుకు వెళ్లిన ఏపీ పోలీసులకు ఆయన సహకరించలేదు. తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని.. మరో ఏజెన్సీ వారికి వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?, ఆ నలుగురి విచారణ

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

జగనే కావాలని కత్తితో పొడిపించుకున్నడు... పరిటాల సునీత

జగన్ పై దాడి: జాతీయ నేతలతో చంద్రబాబు లంచ్ మీటింగ్

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్ మహేష్ బాబు సినిమా సీన్ ను ఫాలో అయ్యారు

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

Follow Us:
Download App:
  • android
  • ios