Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

విజయలక్ష్మితో పాటు రేవతిపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రీనివాస రావు స్నేహితుడు చైతన్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Attack on YS jagan: Two more in Police custody
Author
Visakhapatnam, First Published Oct 27, 2018, 1:03 PM IST

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జగన్ పై దాడి చేసిన జనిపల్లి శ్రీనివాస్ రావు తన జేబులో పెట్టుకున్న లేఖలో కొన్ని పేజీలను తన చిన్నాన్న కూతురు విజయలక్ష్మి, సహోద్యోగి రేవతిపతి రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

లేఖలోని రాత ఒక్కరు రాసినట్లుగా లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొన్ని పేజీలను వారిద్దరు రాసినట్లు శ్రీనివాస రావు తమకు చెప్పారని పోలీసులు అంటున్నారు. అయితే, జగన్ పై శ్రీనివాస రావు దాడి చేయబోతున్నట్లు వారిద్దరికి ముందే తెలుసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

విజయలక్ష్మితో పాటు రేవతిపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రీనివాస రావు స్నేహితుడు చైతన్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫ్లెక్సీలు కట్టడంలో గిడ్ల చైతన్య శ్రీనివాస రావుకు సహకరించినట్లు చెబుతున్నారు. విజయలక్ష్మిని, చైతన్యను ముమ్మిడివరం మండలం ఠానేలంకలో అదుపులోకి తీసుకుని వారిద్దరిని పోలీసులు విశాఖపట్నం తరలించారు.  

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రా

Follow Us:
Download App:
  • android
  • ios