విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన జనిపల్లి శ్రీనివాస రావు కోడి పందేల్లో కీలక పాత్ర పోషించేవాడని తెలుస్తోంది. పందేల్లో వదిలే కోడి పుంజులకు కత్తులు కట్టడంలో అతను ఆరితేరినవాడని సమాచారం. 

సంక్రాంతి పండుగ వేళల్లో జరిగే పందేల్లో అతను ముమ్మిడివరంలో పుంజులకు కత్తులు కట్టేవాడని చెబుతున్నారు. అతనితో పాటు అతని తండ్రి తాతా రావు కూడా ఈ విద్యను వాడుతూ డబ్బులు సంపాదించేవారని చెబుతున్నారు. 

శ్రీనివాస రావు జగన్ పై దాడికి వాడిన కత్తిని స్థానిక వ్యాపారి నుంచి జనవరిలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. శ్రీనివాస రావు రాసిన లేఖను తాము సిఐఎస్ఎఫ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

లేఖలోని కొన్ని పేజీలు రాయడానికి తనకు సోదరి వరుసైన జె. విజయలక్ష్మి, సహోద్యోగి రేవతిపతి సాయం తీసుకున్నట్లు శ్రీనివాస రావు దర్యాప్తు అధికారులకు చెప్పాడు.

సంబంధిత వార్తలు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత