పేరుకు మాత్రమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చేస్తున్న పనులన్నీ నవ్వులపాలవుతున్నాయి. తాజాగా రాజధాని నిర్మాణ విషయమే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి డిజైన్ల విషయంలో బుధవారం ఉదయం చంద్రబాబునాయుడు-రాజమౌళి మధ్య సమావేశం జరిగింది. ప్రపంచప్రఖ్యాత ఆర్కిటెక్టులు అందించిన డిజైన్లు ఏవీ చంద్రబాబుకు నచ్చలేదు. పైగా డిజైన్ల తయారు చేసే పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ప్రజాధనం కూడా వృధా అయ్యింది.

అటువంటి చంద్రబాబుకు బాహుబలి సినిమా కోసం దర్శకుడు చేయించుకున్న మాహిష్మతి రాజ్యం సెట్టింగులు తెగ నచ్చేసాయి. అంతే, ‘‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’’ అన్నట్లు వెంటనే రాజమౌళిని ప్రవేశపెట్టారు చంద్రబాబు ముందు. అంటే గడచిన ఏడాదిగా బ్రిటన్ ఆర్కిటెక్టు నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లేవీ చంద్రబాబుకు నచ్చలేదు. అయితే, రాజమౌళి సినిమా దర్శకుడే అయినా ఊహాల్లో కాకుండా వాస్తవ ప్రపంచంలోనే ఉండేట్లే కనబడుతోంది. అందుకనే చంద్రబాబు రాజధాని డిజైన్ల గురించి ప్రస్తావించగానే తన వల్ల కాదన్నారు. ‘‘తాను కేవలం సినిమా దర్శకుడిని మాత్రమేనని తనకు కావాల్సింది తన ఆర్ట్ డైరెక్టర్ కు చెప్పి చేయించుకుంటా’’నని స్పష్టంగా చెప్పారు.
అయినా, ఇవతలున్నది 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా? అందుకే పట్టుపట్టి ఒప్పించారు. అందులో భాగమే ఈరోజు ఇద్దరి భేటీ జరిగింది. బ్రిటన్ వెళ్ళి ఫోస్టర్ తో చర్చలు జరపాలట. రాజధాని డిజైన్లు ఏ విధంగా ఉండాలో చెప్పి కొత్తగా డిజైన్లు గీయించే బాధ్యతను సినిమా దర్శకుడిమీద ఉంచారు చంద్రబాబు. ఇక్కడే చాలామందికి ఓ విషయం అర్ధం కాలేదు. దాదాపు వారం పాటు ఫోస్టర్ విజయవాడలోనే మకాం వేసారు. వారిద్దరి మధ్య విజయవాడలోనే భేటీ ఏర్పాటు చేయించుంటే లండన్ వెళ్ళి మాట్లాడుకునేదేదో ఇక్కడే మాట్లాడుకునే వారు కదా?
అదేవిధంగా, లండన్ వెళ్ళి ఫోస్టర్ డిజైన్లు చూడాలట రాజమౌళి. ఫోస్టర్ తయారుచేసిన డిజైన్లన్నింటినీ చంద్రబాబుకు చూపించారు కదా? ఆ డిజైన్లను రాజమౌళి కూడా చూసారు. మళ్ళీ రాజమౌళికి ఫోస్టర్ కొత్తగా లండన్లో చూపించే డిజైన్లు ఏముంటాయి? చంద్రబాబు ఆలోచనల్లో కేవలం ఇటు ఫోస్టర్ కి అటు రాజమౌళి కి టైం వేస్ట్ తప్ప ఒరిగేదీమీ లేదు. చంద్రబాబు వరస చూస్తుంటే అసలు అమరావతి నిర్మాణం చేసే ఆలోచనుందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి అందరిలోనూ. సరిగ్గా ఎన్నికలకు ముందు నిర్మాణాలు మొదలుపెట్టి వాటిని జనాలకు చూపించి ఓట్లు రాబట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనబడుతోంది. ఎనీ డౌట్?