గంజాయిపై ఉక్కుపాదం.. అదే, టీడీపీ నేతలకు కడుపుమంట: మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు
రాష్ట్రంలో గంజాయిసాగు జరగడం లేదని.. ఇది టీడీపీ (tdp) నేతలకు కడుపుమంటగా వుందన్నారు మంత్రి కన్నబాబు (minister kannababu). బుధవారం కాకినాడ (kakinada)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీకి భూములంటే అమరావతి (amaravathi) భూములేని, రైతులంటే అమరావతి రైతులే అని విమర్శించారు
రాష్ట్రంలో గంజాయిసాగు జరగడం లేదని.. ఇది టీడీపీ (tdp) నేతలకు కడుపుమంటగా వుందన్నారు మంత్రి కన్నబాబు (minister kannababu). బుధవారం కాకినాడ (kakinada)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీకి భూములంటే అమరావతి (amaravathi) భూములేని, రైతులంటే అమరావతి రైతులే అని విమర్శించారు. రోజుకో రకమైన ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుడమే ఎజెండాగా పెట్టుకున్నారని కన్నబాబు ఫైర్ అయ్యారు. రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
క్రాప్ హాలీడే ప్రకటించారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక రైతులకు ఏ కష్టం రానివ్వకుండా చూస్తున్నారని, రైతులంతా సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.. హైదరాబాద్‌లో చంద్రబాబు (chandrababu ), ఆయన తనయుడు (nara lokesh) విశ్రాంతి తీసుకుంటూ..టీడీపీ శ్రేణులతో సీజన్‌కో అవతారం ఎత్తించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కన్నబాబు సెటైర్లు వేశారు.
ALso Read:లోకేశ్‌కి దుబాయ్‌లో ఏం పని.. చంద్రబాబు ఫ్యామిలీ డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగిందా: సజ్జల సంచలన వ్యాఖ్యలు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan) అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి ప్రశంసించారు. వైయస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు.. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని కన్నబాబు చెప్పరు. రైతాంగం కోసం సీఎం జగన్ వ్యవస్థలను నిర్మిస్తున్నారని కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో పంటల సాగు బాగుంది.. రైతులు కూడా బాగున్నారు. రైతుల ఆనందం చూడలేక రాష్ట్రంలో టీడీపీ నాయకులు మాత్రమే బాధపడుతున్నారు. అలాంటి గంజాయి సాగును రాష్ట్రంలో ఒప్పుకోమని అలాంటి సాగుపై ఉక్కుపాదం మోపుతాం అని కన్నబాబు వార్నింగ్ ఇచ్చారు.