MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చరణ్, బన్నీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..ఆ కథ ఓకే అయితే రికార్డులకు పాతరే, ఇద్దరూ అలాంటి పాత్రల్లో 

చరణ్, బన్నీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..ఆ కథ ఓకే అయితే రికార్డులకు పాతరే, ఇద్దరూ అలాంటి పాత్రల్లో 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ లో పుష్ప 2 చిత్రంతో సందడి చేయబోతున్నారు. రాంచరణ్ గేమ్ గేమ్ ఛేంజర్ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. వీళ్లిద్దరి నుంచి వరుసగా రెండు నెలల్లో పాన్ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 29 2024, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mega Family

Mega Family

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ లో పుష్ప 2 చిత్రంతో సందడి చేయబోతున్నారు. రాంచరణ్ గేమ్ గేమ్ ఛేంజర్ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. వీళ్లిద్దరి నుంచి వరుసగా రెండు నెలల్లో పాన్ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక రేంజ్ లో పుష్ప 2 హంగామా సాగుతోంది. కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

25

వారి మధ్య విభేదాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. రాంచరణ్ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇలా ఫ్యాన్స్ మధ్య గొడవలకు కారణం అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే చరణ్, బన్నీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 

35

చరణ్, బన్నీ కాంబోలో మల్టీస్టారర్ మూవీ ఇప్పటికే కుదరకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్, చరణ్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతుంది అని ఎవరైనా ఊహించారా ? రాజమౌళి చేసి చూపించారు. రాజమౌళి తరహాలో బలమైన కథతో ఏ డైరెక్టర్ అయినా ముందుకు వస్తే అది జరుగుతుంది. దీని గురించి రాంచరణ్ కొన్నేళ్ల క్రితమే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

45

రాంచరణ్ ఎవడు చిత్రంలో అల్లు అర్జున్ చిన్న గెస్ట్ రోల్ లో నటించాడు. ఒకరి ముఖం మరొకరికి మార్చే ఫేస్ సర్జరీ నేపథ్యంలో యాక్షన్ చిత్రంగా ఎవడు తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో పూర్తి స్థాయి మల్టీస్టారర్ మూవీ చేయాలనే కోరికని రాంచరణ్ బయట పెట్టారు. 

55

తమ మల్టీస్టారర్ చిత్రానికి చరణ్ - అర్జున్ అనే టైటిల్ కూడా రాంచరణ్ ప్రస్తావించారు. అయితే కథలో తమ పాత్రలో నెగిటివ్ రోల్స్ గా ఉండాలని.. అలాంటి కథ కుదిరితే తప్పకుండా మల్టీస్టారర్ మూవీ చేస్తాం అని రాంచరణ్, అల్లు అర్జున్ గతంలో తెలిపారు. చరణ్, అల్లు అర్జున్ లతో పూర్తి స్థాయి మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉన్నట్లు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మనసులో మాట బయటపెట్టారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్స్ లో అల్లు అర్జున్, చరణ్ కలసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Recommended image2
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Ranveer Singh: రణ్‌వీర్ డెబ్యూ చేసేటప్పటికి ఈ హీరోయిన్‌కు 5 ఏళ్లే.. ఇప్పుడు ఆయనతోనే రొమాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved