లోకేశ్‌కి దుబాయ్‌లో ఏం పని.. చంద్రబాబు ఫ్యామిలీ డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగిందా: సజ్జల సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (telugu desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)పై విరుచుకుపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). డ్రగ్స్ ఇష్యూని ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దుబాయ్‌లో నారా లోకేశ్ (Nara Lokesh) ఏం చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (telugu desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)పై విరుచుకుపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని సజ్జల దుయ్యబట్టారు. డ్రగ్స్ ఇష్యూని ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దుబాయ్‌లో నారా లోకేశ్ (Nara Lokesh) ఏం చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు కూడా సింగపూర్, హాంగ్‌కాంగ్, మాల్దీవులు, మారిషస్ వెళ్లారని చెప్పారు.
చంద్రబాబు తాను సంపాదించిన డబ్బును డ్రగ్స్ వ్యాపారం వైపు మళ్లీంచారని సజ్జల ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతో.. ఆయన కుటుంబం డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగారా అంటూ రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. అది బయటకు రాకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీబీఐ (CBI), డీఆర్ఐ (DRI) వంటి ఏజెన్సీలు అసలు విషయం రాబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల చెప్పారు. ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో దశాబ్ధాలుగా గంజాయి సాగు జరుగుతోందని.. అది ఇప్పుడు బయటకు రావడానికి కారణం సీఎం జగనే (YS Jagan) అని ఆయన చెప్పారు.
Also Read:డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దు: పోలీసులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం
ఆయన ప్రత్యేక బృందాలను నియమించి ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినందు వల్లే ఇటీవలి కాలంలో రైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని సజ్జల చెప్పారు. గడిచిన ఏడాదిన్నరలో 2 లక్షల 50 వేల కేజీల గంజాయిని సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. వేల కోట్ల విలువైన డ్రగ్స్ కేసు (Drugs case)లో ఎవరున్నారో దర్యాప్తులో బయటకు వస్తుందని సజ్జల స్పష్టం చేశారు. ఇంత భారీగా గంజాయి దొరుకుతుంటే ఇది ఎన్నేళ్లుగా కొనసాగుతోందో బయటకు రావాల్సిన అవసరం వుందని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా చంద్రబాబుకు సిగ్గులేదని ఆయన దుయ్యబట్టారు. హద్దూపద్దూ లేని ఆరోపణలు చేస్తున్నారని.. ప్రభుత్వంపై విష ప్రచారం కొనసాగుతోందని సజ్జల తెలిపారు. దారుణంగా దిగజారి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.