Asianet News TeluguAsianet News Telugu

అమ్మ చంద్రబాబు.. : ఐటీ దాడులపై బొత్స వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇది చూసిన తర్వాత తనకు ‘‘ అమ్మ చంద్రబాబు నాయుడు’’ ఎంతటి ఘనుడవయ్యా నువ్వు అని అనిపించిందన్నారు. 

minister botsa satyanarayana slams chandrababu over it raids in telugu states
Author
Amaravathi, First Published Feb 14, 2020, 3:23 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇది చూసిన తర్వాత తనకు ‘‘ అమ్మ చంద్రబాబు నాయుడు’’ ఎంతటి ఘనుడవయ్యా నువ్వు అని అనిపించిందన్నారు.

అమరావతి అనే పేరును ఒక వ్యాపార సంస్థగా, రియల్ ఎస్టేట్‌గా మార్చేశారని బొత్స ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని సోదా చేశామని, మొత్తం 40 చోట్ల సోదాలు చేశామని తెలిపింది. ఏ

దో ఒక సంస్థల్లో తనిఖీలు జరగడం సర్వసాధారణమేనని.. కానీ ఓ ప్రముఖ వ్యక్తి ప్రైవేట్ సెక్రటరీ ఇంట్లో సోదాలకు దిగడం రాష్ట్రానికి ప్రమాదకరమన్నారు. ఇఅమరావతిలో రూ.46,000 కోట్ల అవినీతి జరిగిందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని మంత్రి గుర్తుచేశారు.

Also Read:ఆ రూ.2వేల కోట్ల అవినీతిపై పవన్ మాట్లాడడే..? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

అందువల్లే రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను నిలిపివేసి రివర్స్ టెండరింగ్‌తో పాటు జ్యూడీషియల్ రివ్యూకు పంపానమని బొత్స వెల్లడించారు. తమకు అభివృద్ధి కావాలి కానీ.. అవినీతి అక్కర్లేదని సత్తిబాబు చెప్పారు. 

ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి బాగోతం రాష్ట్రానికే కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసిపోయిందని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో పేదలకు కట్టిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొందరి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారని మంత్రి గుర్తుచేశారు.

ఒక ప్రైవేట్ సెక్రటరీ ఇంట్లోనే దాడులు చేస్తే రూ.2 వేల కోట్లు దొరికాయని.. ఇందుకు సంబంధించి మూడు ఇన్‌ఫ్రా కంపెనీల హస్తం కూడా ఉన్నట్లు తేలిందన్నారు. ఆ కంపెనీల ప్రమోటర్లు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, మరో వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని బొత్స ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు బినామీగా ఉన్న కిలారి రాజేశ్ సైతం ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారని బొత్స మండిపడ్డారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని.. దాని విలువ రూ.3,239 కోట్లన్నారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రూ. 392 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని.. ఇదంతా దోచుకున్నదేనని మంత్రి ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి డబ్బు కడుతుందని అట్టడుగు వర్గాల వారేనని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో రూ.800 కోట్లు ఆదా అయ్యాయన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడులపై ఇంత జరుగుతున్నా చంద్రబాబు, లోకేశ్‌లు కిక్కురుమనడం లేదని బొత్స సెటైర్లు వేశారు. టీడీపీ అవినీతికి సంబంధించి నాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రణాళికలు రూపొందించారని మంత్రి ఆరోపించారు.

Also Read:మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల

ప్రజా ధనాన్ని ఏ రకంగా దోచుకోవచ్చో, ఎలా డొల్ల కంపెనీలు పెట్టుకోవచ్చో కుటుంబరావు ప్లాన్లు వేశారని  ఆయన కూడా ఎక్కడా మాట్లాడటం లేదన్నారు. స్వల్ప మొత్తంలో దొరికిన బంగారం, డబ్బును చంద్రబాబుకు ముడి పెట్టాలని చూస్తున్నారంటూ అచ్చెన్నాయుడు, యనమల అటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు దగ్గర శ్రీనివాస్ రెడ్డి పర్సనల్ సెక్రటరీగా పనిచేయలేదా అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌లు ప్రస్తుతం లెక్కలు తేల్చుకునే పనిమీద హైదరాబాద్‌కు వెళ్లారని సత్తిబాబు ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని.. అయితే ఇప్పుడు ఎక్కడో మిస్‌ఫైర్ అయ్యిందని సత్యనారాయణ సెటైర్లు వేశారు.

ఇది ఎంతదూరం వెళ్తుందో తెలియదని.. పక్కన ఎన్ని 2 వేల కోట్ల పక్కన ఇంకెన్ని సున్నాలు వస్తాయో చెప్పడం కష్టమేనన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్లు అప్పులుగా తెచ్చారని... కానీ దాని లెక్క ఎనిమిది నెలలుగా తేలక తాము తలలు పట్టుకున్నామని సత్యనారాయణ వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios