Asianet News TeluguAsianet News Telugu

టూ లేట్, రాహుల్ ఫోన్ చేసినా కాంగ్రెస్ లో ఉండను: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రెస్ లో ఉండలేనన్నారు. టూ లేట్ అంటూ పెదవి విరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అందువల్ల చంద్రబాబు నాయుడు విందుకు ఆహ్వానిస్తే వెళ్లామని చెప్పుకొచ్చారు. 

kotla suryaprakash reddy comments on congress
Author
Kurnool, First Published Jan 31, 2019, 10:30 AM IST

కర్నూలు: కాంగ్రెస్ పార్టీలో ఇక ఉండదలచుకోలేదని కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. 

కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తులు ఉండవని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చినట్లు తెలిపారు. తనతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరూ మాట్లాడలేదన్నారు.

ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రెస్ లో ఉండలేనన్నారు. టూ లేట్ అంటూ పెదవి విరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అందువల్ల చంద్రబాబు నాయుడు విందుకు ఆహ్వానిస్తే వెళ్లామని చెప్పుకొచ్చారు. 

తన భార్య డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రరెడ్డి, సోదరుడితో కలిసి చంద్రబాబును కలిసినట్లు కార్యకర్తలకు చెప్పారు. తమ భేటీలో చంద్రబాబు తనను టీడీపీలో చేరాలని కోరలేదని, తాను చేరుతున్నానని కూడా చెప్పలేదన్నారు. కర్నూలు జిల్లాలో సమస్యలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. 

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుండ్రేవుల జలాశయం, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ నిర్మించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. వేదవతి ప్రాజెక్టుకు సీఎం జీవో ఇచ్చారని గుండ్రేవుల ప్రాజెక్టు ఇస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. 

తనను తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు ఆహ్వానించిన మాట వాస్తవమేనని అయితే కార్యకర్తల నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. తన అభిమానులు, కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 

స్వతంత్రంగా పోటీ చేయాలన్నా దానికి కూడా సిద్ధమేనన్నారు. ఇకపోతే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఫిబ్రవరి 8 తర్వాత సైకిలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  
 

ఈ వార్తలు కూడా చదవండి

పొమ్మనలేక పొగబెట్టే కుట్ర, అప్పుడు ఆత్మక్షోభించదా..? : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో కోట్ల కలకలం: అంతుబట్టని కేఈ అంతరంగం

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: చంద్రబాబు స్కెచ్ ఇదీ...

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే...

టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

Follow Us:
Download App:
  • android
  • ios