అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం సమావేశమైంది. చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని విందుకు ఆహ్వానించారు. 

ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం భేటీ అయ్యింది. విందుకు ముందు  తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై కోట్ల దంపతులు చంద్రబాబు నాయుడుతో చర్చించారు. కర్నూలు పార్లమెంట్ స్థానంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

కర్నూలు పార్లమెంట్ స్థానంపై చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆశిస్తున్న స్థానంపై కూడా చర్చించారు. కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. 

అయితే ఆ స్థానం ఇచ్చే అంశంపై చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. డోన్ కాకుండా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇస్తానని హామీ లేదా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. భేటీ అనంతరం కార్యకర్తలతో భేటీ అయి మంచి రోజున పార్టీలో చేరతామంటూ చంద్రబాబుకు కోట్ల కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ