Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో టీడీపీలో ఉన్న నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరితే  టీడీపీ నేతల సీట్లకు ఎసరు వచ్చేలా ఉంది.. ఏ

kotla suryaprakash reddy wants dhone assembly seat
Author
Kurnool, First Published Jan 28, 2019, 2:38 PM IST


కర్నూల్: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో టీడీపీలో ఉన్న నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరితే  టీడీపీ నేతల సీట్లకు ఎసరు వచ్చేలా ఉంది.. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి  కుటుంబం గతంలో ప్రాతినిథ్యం వహించిన డోన్ అసెంబ్లీ సీటును తమకు ఇవ్వాలని కోట్ల కుటుంబం  పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరే విషయాన్ని  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి  టీడీపీ నాయకత్వం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కర్నూల్ జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కోట్ల కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించింది. నాలుగైదు రోజులుగా టీడీపీ నేతలు కోట్ల కుటుంబంతో  టచ్‌లోకి వెళ్లారు. టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యతిరేకించింది. కానీ, టీడీపీతొ పొత్తు పట్ల కోట్ల  సూర్యప్రకాష్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు.

ఈ సమయంలో  కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  సోమవారం సాయంత్రం చంద్రబాబునాయుడుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో  పలు విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

కర్నూల్ పార్లమెంట్ స్థానంతో పాటు  కోడుమూరు, డోన్ అసెంబ్లీ నియోజకర్గాలను  కూడ కోట్ల కుటుంబం అడుగుతున్నట్టు సమాచారం. డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో  కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికల సమయంలో కేఈ ప్రభాకర్  టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. కర్నూల్ ఎంపీ స్థానం తనకు కావాలని ప్రభాకర్ పట్టుబట్టారు. కానీ చంద్రబాబునాయుడు కేఈ ప్రభాకర్ కు ఆ స్థానం ఇవ్వలేదు. ఈ కారణంతో ప్రభాకర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  కేఈ ప్రభాకర్  చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. 

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మనందరెడ్డి  గెలుపు కోసం ప్రభాకర్ కృషి చేశారు. దీంతో  ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవితో పాటు నామినేటేడ్ పోస్టు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో డోన్ స్థానం నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అంతకుముందు ఈ స్థానం నుండి కేఈ ప్రభాకర్ టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ  టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ తరుణంలో డోన్ అసెంబ్లీ స్థానం కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. డోన్ నుండి సూర్యప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. డోన్  సీటు ఇచ్చేందుకు కేఈ కుటుంబం సానుకూలంగా లేదనే ప్రచారం కూడ లేదని ప్రచారం సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో డోన్ నుండి  మరోసారి పోటీ చేసేందుకు కేఈ సోదరుడు ప్రతాప్ రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో  కోట్ల కుటుంబం కూడ ఈ స్థానం కోసం  పట్టుబడుతుండడం టీడీపీ నాయకత్వానికి కొంత తలనొప్పే. అయితే ఈ విషయమై చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకొంటారోననే చర్చ సర్వత్రా నెలకొంది.

మరోవైపు కేఈ ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. పత్తికొండ నుండి వచ్చే ఎన్నికల్లో  కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు. కోట్ల ఎంట్రీతో డొన్ విషయమై చిక్కులు వచ్చేలా ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కోట్ల ఫ్యామిలీ  డోన్‌తో పాటు, కోడుమూరు అసెంబ్లీ టిక్కెట్టును కూడ ఆశిస్తున్నారు. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరితే కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు మూడు నియోజకవర్గాల్లో  ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

 

Follow Us:
Download App:
  • android
  • ios