కర్నూల్:  మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరున్నారు. తన వర్గీయులతో ఈ నెల 30వ తేదీన కర్నూల్‌లో కోట్ల సమావేశం కానున్నారు. ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు  పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయమై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి   చర్చించనున్నారు.

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబుతో  భేటీ అయ్యారు. కోట్ల తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడ ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో  టీడీపీతొ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో  తీవ్ర అసంతృప్తితో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పా్ర్టీ సమావేశం నుండి  బయటకు వచ్చారు.

పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరుపై కోట్ల తీవ్ర అసంతృప్తిని సమావేశంలోనే  వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ నాయకత్వం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో  చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపింది.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తో  ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ బృందం హైద్రాబాద్‌లో చర్చలు జరిపినట్టు సమాచారం.  ఈ చర్చల్లో భాగంగా టీడీపీలో చేరేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో  చంద్రబాబుతో భేటీకి టీడీ జనార్ధన్ బృందం ఏర్పాట్లు చేసింది.

సోమవారం రాత్రి ఏపీ సీఎం  చంద్రబాబునాయుడుతో  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భార్య కోట్ల సుజాతమ్మ, కొడుకు  రాఘవేంద్రరెడ్డి, సోదరుడు గిరిధర్ రెడ్డి బాబుతో భేటీ అయ్యారు.కర్నూల్ ఎంపీతో  పాటు డోన్, కోడుమూరు సీట్లను కోట్ల ఫ్యామిలీ బాబును అడిగింది.

అయితే కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు ఆలూరు అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు బాబు  సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. డోన్ స్థానంలో  గత ఎన్నికల్లో  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ ప్రతాప్ పోటీ చేసిన విషయాన్ని  బాబు గుర్తు చేసినట్టు సమాచారం. ఆలూరు ఇంచార్జీ వీరభద్రగౌడ్‌కు నామినేటేడ్ పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మరోవైపు రాఘవేంద్రరెడ్డికి నామినేటేడ్ పదవిని ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే వచ్చే నెల 6వ తేదీన కర్నూల్ లో చంద్రబాబునాయుడు సమక్షంలో  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే  అవకాశం ఉంది. 

ఇంత కాలం పాటు తనతో ఉన్న వారిని కూడ టీడీపీలో చేర్చేందుకు కోట్ల ఫ్యామిలీ సన్నాహలు చేస్తోంది. ఈ నెల 30వ తేదీన సూర్యప్రకాష్ రెడ్డి  కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యకర్తలకు సమాచారం పంపారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ