Asianet News TeluguAsianet News Telugu

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

సీట్ల విషయంలో వైసీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పసుపుకండువా కప్పుకోనున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలూ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలాగే ఆయన సతీమణి కోట్ల సుజాత డోన్, లేదా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

YS Jagan not yeilded to Kotla Surya Prakash reddy's demands
Author
Kurnool, First Published Jan 28, 2019, 3:56 PM IST

కర్నూలు: కాంగ్రెస్ పార్టీతో ఆరు దశాబ్ధాలు పెనవేసుకున్న బంధాన్ని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం వదులుకుంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీడనున్నారని ప్రచారం జరిగింది. 

కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వీడతారాంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. పార్టీ వీడితే కోట్ల కుటుంబం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

అయితే వైఎస్ జగన్ కోట్ల కుటుంబం పెట్టిన షరతులకు నో చెప్పడంతో ఆయన వైసీపీకి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. 

వైసీపీలో తమ డిమాండ్లు నెరవేరే పరిస్థితి లేకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీడనుందని ప్రచారం జరిగిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీతోపాటు వైసీపీకి చెందినన కీలక నేతలు సైతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని సంప్రదించారు. 

అయితే సీట్ల విషయంలో వైసీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పసుపుకండువా కప్పుకోనున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలూ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలాగే ఆయన సతీమణి కోట్ల సుజాత డోన్, లేదా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

వీరితోపాటు తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి రెడ్డిని సైతం రాజకీయాల్లోకి దించాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ నుంచి రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేని పక్షంలో కర్నూలు మేయర్ అభ్యర్థిగా అయినా తనయుడిని రంగంలోకి దింపాలని కోట్లు ఆశిస్తున్నారు. 

అలాగే కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో  సైతం తన అనుచరులకు ఇప్పించాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ట్ల రాఘవేంద్రరెడ్డి కర్నూలు మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయట.  

కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కోడుమూరు, పత్తికొండ, నందికొట్కూరు నియోజకవర్గాలను ప్రభావితం చెయ్యగలరు. ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్లమెంట్ తరుపున పోటీ చేసి భార్య, కుమారుడిని అసెంబ్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదే ప్రతిపాదనలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉంచితే పార్టీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ కర్తగా బీవై రామయ్య ఉన్నారు. ఆయన్ను తప్పించే యోచనలో జగన్ లేరని తెలుస్తోంది.  

ఇకపోతే పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్తగా చెరుకులపాడు శ్రీదేవి ఉన్నారు. ఆమెకు టికెట్ దాదాపు ఖాయమైనట్లేనని ప్రచారం కూడా జరుగుతుంది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఢీకొట్టే సమర్ధత శ్రీదేవికే ఉందని వైసీపీ గట్టిగా భావిస్తుంది. 

ఇక డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ కీలక నేత పిఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన్ను తప్పించే సాహసం వైఎస్ జగన్ చెయ్యని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆశించిన స్థానాల విషయంలో జగన్ చేతులు ఎత్తెయ్యడంతో ఇక టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు హర్షవర్థన్ రెడ్డి తన అనుచరుడిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా హర్షవర్థన్ పనిచేస్తున్నారు కూడా. 

హర్షవర్థన్ ఫిబ్రవరి 6న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేకన్నా తెలుగుదేశం పార్టీలో చేరడమే మేలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని జిల్లా నాయకత్వం సూచిస్తోంది. 

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న జిల్లాలలో కర్నూలు ఒకటి కావడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్నూలు రాజకీయాల విషయంలో వైఎస్ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి
 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios