అమరావతి: కర్నూలు జిల్లా రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దిగ్గజం కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అలాగే డోన్, లేదా ఆలూరు నియోజకవర్గం కూడా ఆశిస్తున్నారు. అటు తనయుడు రాఘవేంద్రరెడ్డి భవితవ్యంపై కూడా చంద్రబాబుకు ఇప్పటికే రాయబారం పంపించారు. 

అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు లోక్ సభ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ స్థానంపై హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కోట్ల సుజాతమ్మకి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. 

డోన్ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టుబట్టొద్దని చంద్రబాబు సన్నిహితులు వద్ద చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. డోన్ అసెంబ్లీ నుంచి లేదా ఆలూరు నియోజకవర్గం ఇచ్చే అంశంపై చర్చించారు. డోన్ లేదా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. 

అటు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు రాఘవేంద్ర రెడ్డి రాజకీయ ఆరంగేట్రంపై చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఒకే ఇంట్లో ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే పార్టీలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని చంద్రబాబు చెప్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ