కర్నూల్: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.  కర్నూల్ జిల్లాలోని  పాలు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడును కోరినట్టు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెబుతున్నారు.  కర్నూల్ ఎంపీ సీటు తనకు కేటాయించే విషయంలో  చంద్రబాబుకు మరో ఆలోచన ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఈ నెల 28వ తేదీ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి బాబును కోట్ల ఫ్యామిలీ మెంబర్స్  కలిసిన విషయం తెలిసిందే.

 కర్నూల్ జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి నేతలను తమ పార్టీలోకి  చేర్చుకోవాలని టీడీపీ నాయకత్వం  ప్లాన్ చేసింది.ఈ  ప్లాన్‌లో భాగంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  కర్నూల్ లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

కర్నూల్‌ ఎంపీ స్థానంతో పాటు ఇతర అసెంబ్లీ స్థానాల గురించి తాను చంద్రబాబు వద్ద మాట్లాడలేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, కర్నూల్ ఎంపీ స్థానం తనకు కేటాయించే విషయంలో బాబుకు మరో ఆలోచన ఉంటుందని  తాను భావించడం లేదని  ఆయన అభిప్రాయపడ్డారు.

కర్నూల్ జిల్లాలోని  మూడు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించాలని సీఎం చంద్రబాబును కోరినట్టుగా సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.  వేదావతి, గుండ్రేవుల, ఆనవాలు, తుంగభద్ర లో లెవల్ కెనాల్ పనులు పూర్తి చేయాలని  సీఎంను కోరినట్టు ఆయన తెలిపారు.

వేదావతి ప్రాజెక్టు నిర్మాణపనులకు సంబంధించి ఏపీ నీటిపారుదల శాఖాధికారులు పరిపాలనామోదం తెలుపుతూ మంగళవారం నాడే ఉత్తర్వులు జారీ చేశారు.గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం హామీ ఇచ్చినట్టు కోట్ల చెప్పారు. ఆనవాలు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే తాను ఏ సీట్ల గురించి చంద్రబాబు వద్ద ప్రస్తావించలేదని కోట్ల పైకి చెబుతున్నప్పటికీ కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు డోన్, కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంట్లను కూడ కోట్ల  కోరినట్టుగా చెబుతున్నారు.  కర్నూల్ ఎంపీ స్థానం  కోట్లకు ఇచ్చేందుకు  బాబు సానుకూలంగా స్పందించారు. అయితే డోన్ విషయంలోనే బాబు ఇంకా తేల్చలేదని చెబుతున్నారు . డోన్‌కు బదులుగా ఆలూరు అసెంబ్లీ స్థానం కోట్ల ఫ్యామిలీకి ఇచ్చేందుకు  బాబు అంగీకరించినట్టుగా  టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబునాయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరికను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ