Asianet News TeluguAsianet News Telugu

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో బుట్టా రేణుక వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసే అవకాశం ఉంది

butta renuka likely to contest from panyam assembly segment in up coming elections
Author
Kurnool, First Published Jan 28, 2019, 3:06 PM IST

కర్నూల్: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో బుట్టా రేణుక వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసే అవకాశం ఉంది. పాణ్యం నుండి రేణుక బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే  పాణ్యం నుండే రేణుక బరిలోకి దిగుతోందా మరో స్థానాన్ని ఆశిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ టీడీపీలో చేరనున్నారుద. కోట్ల కుటుంబం కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు డొన్, కోడుమూరు అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నారు. 

ప్రస్తుతం కర్నూల్ ఎంపీగా బుట్టా రేణుక ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో  బుట్టా రేణుక వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరారు.

కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో బుట్టా రేణుకకు  కర్నూల్ ఎంపీ స్థానం దక్కదు. కర్నూల్ ఎంపీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  బరిలోకి దిగే  అవకాశం ఉంది.

సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకను పాణ్యం నుండి బరిలోకి దిగే  అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే  మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికల్లో పాణ్యం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన బిజ్జం పార్థసారథి రెడ్డి కూడ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

బిజ్జం పార్థసారధి రెడ్డి 2004 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిజ్జం పార్థసారథిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి మధ్య రాజీ కుదిర్చినట్టు అప్పట్లో ప్రచారం సాగింది.

ఆ ఎన్నికల సమయం నుండి బిజ్జం పార్థసారథి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో బిజ్జం పార్థసారధి రెడ్డి పోటీకి ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు నంద్యాల ఎంపీ స్థానం నుండి కూడ పోటీకి కూడ బిజ్జం సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఏడాదిన్నర క్రితం కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీడీపీలో చేరేందుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బైరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

శివానందరెడ్డి కూడ వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో  కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి రావాలని నిర్ణయం తీసుకోవడంతో పాణ్యం నుండి బుట్టా రేణుక పోటీ చేయవచ్చని అంటున్నారు. ఒకవేళ పాణ్యం నుండి కాకపోతే బుట్టా రేణుకకు ఏ స్థానం కేటాయిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios