Asianet News TeluguAsianet News Telugu

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

రాబోయే ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చెయ్యాలని ఆమె భావించారు. టికెట్‌ తనకే అంటూ కర్నూలూ పార్లమెంట్ నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. గతంలో మంత్రి నారా లోకేష్ సైతం బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
 

Butta Renuka reacts on Kotla Suryaprakash Reddy's TDP entry
Author
Kurnool, First Published Jan 29, 2019, 4:49 PM IST

కర్నూల్: కర్నూలు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా ఉన్న కోట్ల కుటుంబం టీడీపీ వీడుతుండటంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికపై తెలుగుదేశం పార్టీలోనే బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్వాగతిస్తే...డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అయితే ఏకంగా తనకేం తెలియదంటూ అలిగి కూర్చున్నారు. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కర్నూల్ పార్లమెంట్ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలను ప్రస్తుత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎలా స్పందిస్తారా అంటూ అంతా ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఆమె మౌనం దాల్చారే తప్ప ఎక్కడా స్పందించలేదు. 

అయితే అభిమానులు, కార్యకర్తల ఒత్తిడితో మంగళవారం పెదవి విప్పక తప్పలేదు బుట్టా రేణుకకు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకపై స్పందించిన ఆమె టీడీపీలోకి ఎవరొచ్చినా పార్టీ బలోపేతమవుతుందన్నారు. అయితే టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పుకొచ్చేశారు. 

అందరికి న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందని స్వామి భక్తిని ప్రదర్శించారు ఎంపీ బుట్టా రేణుక. కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని కన్ఫమ్  కావడంతో ఆమెను అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు.  

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు బుట్టా రేణుక. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరురాలిగా కొనసాగుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆమె కేవలం సానుభూతిపరురాలిగా ఉంటూ తన భర్తను మాత్రం తెలుగుదేశం పార్టీలో చేర్చారు. ఆనాటి నుంచి బుట్టా రేణుక టీడీపీ ఎంపీగానే అనధికారంగా కొనసాగుతున్నారు. 

రాబోయే ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చెయ్యాలని ఆమె భావించారు. టికెట్‌ తనకే అంటూ కర్నూలూ పార్లమెంట్ నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. గతంలో మంత్రి నారా లోకేష్ సైతం బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

చినబాబు హామీతో ఆమె తన పర్యటనను విస్తృతం చేశారు. తాజా పరిణామాలతో ఆమె ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆమె రాజకీయ భవిష్యత్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించి అసెంబ్లీకి పంపే అంశంపై చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. 

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఉండటంతో ఆయన స్థానంలో బుట్టా రేణుకను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీవీ జయనాగేశ్వరరెడ్డి అందుకు ఒప్పుకుంటారా అన్న సందేహం నెలకొంది. 

అటు ఎంపీ టికెట్ పోయే, ఇటు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది బుట్టా రేణుక పరిస్థితి. ఇక చేసేది లేక బుట్టా రేణుక భారం చంద్రబాబుపై నెట్టేశారు. 

అలా స్వామిభక్తిని ప్రదర్శించినా ఎమ్మెల్సీనో లేక రాజ్యసభ అవకాశం కల్పిస్తారోనని ఆమె భావిస్తున్నారు. మెుత్తానికి బుట్టా రేణుక రాజకీయ భవిష్యత్ పై మిస్టరీ వీడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.  

ఈ వార్తలు కూడా చదవండి

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios