School Holidays : కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఈరోజు సెలవు ఉన్నట్లా, లేనట్లా?
Karthika Pournami Holiday : ప్రస్తుతం పవిత్రమైన కార్తీక మాసం కొనసాగుతోంది. వచ్చేవారమే కార్తీక పౌర్ణమి కూడా ఉంది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉంటుందా?

కార్తీక పౌర్ణమికి సెలవుందా?
హిందువులకు కార్తీకమాసం చాలా ప్రత్యేకమైనది... ఇది శివకేశవులు (శివుడు, విష్ణువు) ఇద్దరికీ ఇష్టమైన నెలగా పేర్కొంటారు. అందుకే ఇటు శివభక్తులు, అటు విష్ణు భక్తులు ఈ మాసంలో భక్తిశ్రద్దలతో పూజలు చేస్తుంటారు... దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. అంతేకాదు చాలామంది మహిళలు ఈ నెలలోనే తులసిపూజలు చేస్తుంటారు.
కార్తీక దీపాలు వెలిగించడం, కార్తీక స్నానాలు చేయడం, కుటుంబసభ్యులంతా కార్తీక వనభోజనాలకు వెళ్లడం... ఇలా నెలరోజులు పండగ వాతావరణం ఉంటుంది. అయితే కార్తీకమాసం అంతా ఒకెత్తు, కార్తీక పౌర్ణమి ఇంకో ఎత్తు... ఈరోజు మరింత పవిత్రమైందిగా భావిస్తారు. అందుకే చాలామంది ఈరోజే పూజలు, వ్రతాలు, దీపారాధన, నదీస్నానాలు చేస్తుంటారు.
అయితే ప్రతిసారి కార్తీక పౌర్ణమికి తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు సెలవు ఉంటుందా, ఉండదా? అని... ఈసారి కూడా ఇది కొనసాగుతోంది. మరి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక పౌర్ణమికి సెలవు ఉందో, లేదో తెలుసుకుందాం.
తెలంగాణలో కార్తీక పౌర్ణమికి అధికారిక సెలవు
నవంబర్ 24న అంటే వచ్చే మంగళవారమే కార్తీక పౌర్ణమి పర్వదినం ఉంది. ఈరోజు అధికారిక సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.. ఈ మేరకు హాలిడే క్యాలెండర్ లో పేర్కొంది. అంటే తెలంగాణలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కార్తీక పౌర్ణమికి సెలవు ఉందన్నమాట.
విద్యార్థులకు సెలవు ఉందా?
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు అంటే గవర్నమెంట్ టీచర్లకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవు అన్నట్లే... ఈ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు సెలవు ఉంటుందన్నమాట.
అయితే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు సెలవు ఉంటుందా, లేదా? అన్నదే కన్ఫ్యూజన్. మైనారిటీ విద్యాసంస్థలు మినహా మిగతా ప్రైవేట్ స్కూళ్ళకి కార్తీక పౌర్ణమి సెలవు ఉండే అవకాశాలున్నాయి.
నవంబర్ 24న కార్తీక పౌర్ణమి మాత్రమే కాదు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా ఉంది... కాబట్టి హిందుత్వ, సిక్కు సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకి పక్కా సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవు స్కూల్ మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక పౌర్ణమి సెలవు ఉందా?
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు... కానీ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే మాత్రం ఇచ్చారు. కావాలనుకుంటే మాత్రమే ముందస్తు అనుమతితో నవంబర్ 24న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు... వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. మహిళలు, సిక్కులు ఈ ఆప్షనల్ హాలిడేను ఎక్కువగా వాడుకునే అవకాశాలున్నాయి... మిగతా ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ ఆప్షనల్ హాలిడే వర్తిస్తుంది... విద్యార్థులకు కాదు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలు నవంబర్ 24న యధావిధిగా పనిచేయనున్నాయి. అయితే కొన్ని హిందుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేవి, సిక్కు కమ్యూనిటీ పిల్లలు ఎక్కువగా చదివే ప్రత్యేక విద్యాసంస్థలకు మాత్రం సెలవు ఉండే అవకాశాలున్నాయి.













