వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి సెల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చిందని తెలిపారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.

దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించిన ఆయన.. రాఘవరెడ్డి తర్వాత... అవినాశ్ కార్యాలయంలో పనిచేసే భరత్ రెడ్డి కడప ఎస్పీ కార్యాలయానికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారని చెప్పారు.

సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి బయలుదేరినట్లు తెలిపారు. వివేకా ఇంటి వద్ద ఆయన పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మెన్ రంగన్న, ఇనయతుల్లా, శంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, కంపౌండర్‌ ప్రకాశ్ రెడ్డి, డా. నాయక్, వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు మరో 20 మంది అక్కడ ఉన్నట్లు తెలిపారు.

వివేకా రక్తపు వాంతులు చేసుకుని మరుగుదొడ్డి కమోడ్‌పై పడి గాయాలపాలై చనిపోయినట్లు వీరిలో కొందరు చెప్పారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. అంతకు ముందే బెడ్‌రూమ్‌లో రక్తపు మరకలు శుభ్రం చేసి ఉన్నాయని, పోలీసులు లోపలికి వెళ్లిన సమయంలో రక్తపు మరకలతో ఉన్న దుప్పటిని తొలగిస్తున్నట్టు తెలిపారు.

వివేకా తల, చేతిపై గాయాలుండటంతో గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని గాయాలకు కట్లు వేశారని రాహుల్ దేవ్ తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు రేంజ్ డీఐజీ పులివెందులకు చేరుకున్న తర్వాత వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన పీఏ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని కూతురు సునీత డీఐజీకి అప్పగించారు.

లేఖను ఉదయం పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించగా.. డ్రైవర్ ప్రసాద్ ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉందని భయపడి తాము వచ్చేంత వరకు ఆ లేఖను కృష్ణారెడ్డి వద్దే ఉంచాలని చెప్పినట్లు సునీత తెలిపారు. ఆ లేఖలోని చేతి రాత ఆయనదేనని సునీత డీఐజీకి వెల్లడించారు. 

కాగా, హత్య కేసులో పోలీసులకు అనేక చిక్కు ముడులు ఎదురవుతున్నాయి. వీటిని విప్పేందుకు సిట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్, స్థానిక పోలీసు బృందాలు హత్య జరిగిన రోజు రాత్రి 11.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఒక ఆర్డర్‌లో పెట్టుకుని ఏం జరిగి ఉండొచ్చనే దానిపై విశ్లేషిస్తున్నాయి. మరోవైపు వివేకా ఇంటిని సిట్ బృందం మరోసారి పరిశీలించింది.

కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డిలను పోలీసులు విచారించారు. అలాగే పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో వైఎస్ కుటుంబ బంధువులు, అన్నదమ్ములు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను సిట్ ప్రశ్నించింది. విచారణలో భాగంగా పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం