MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్

Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్

Weather update : ఇంకా చలికాలమే ముగియలేదు.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 11 2026, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శివరాత్రితో చలికి గుడ్ బై...
Image Credit : Getty

శివరాత్రితో చలికి గుడ్ బై...

Weather Update : శివరాత్రి వచ్చిందంటే చాలు చలి 'శివశివా' అనుకుంటూ వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రతిసారి సరిగ్గా ఇలాగే జరుగుతుంది.. శివరాత్రి తర్వాత చలి పూర్తిగా తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈసారి కూడా ఇదే జరగనుందని... మరో మూడు నాలుగు రోజుల్లో శీతాకాలం ముగిసినట్లేనని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

26
తెలంగాణ వాతావరణం ఎలా ఉటుందంటే... వెదర్ మ్యాన్ అంచనా
Image Credit : Getty

తెలంగాణ వాతావరణం ఎలా ఉటుందంటే... వెదర్ మ్యాన్ అంచనా

ప్రస్తుతం రాత్రి, ఉదయం వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి... దీంతో చలి కొనసాగుతోంది. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఎండ మండిపోతూ ఉక్కపోత ఉంటోంది. ఈ మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని...పగటిపూట 33 డిగ్రీలు ఉంటుందని హెచ్చరించారు. రాత్రి, ఉదయం వేళల్లో కూడా 16 నుండి 18 డిగ్రీలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

More 3days of winter season left

Enjoy it to the fullest 

Thereafter temperatures will start rising gradually to the range of 33°C, night chill will also reduce to the range of 16-18°C

— Telangana Weatherman (@balaji25_t) February 10, 2026

Related Articles

Related image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
36
ఈ తెలంగాణ జిల్లాల్లో చలి..
Image Credit : Generated by google gemini AI

ఈ తెలంగాణ జిల్లాల్లో చలి..

రాబోయే రెండుమూడు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని...కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి 11 (బుధవారం) ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

pic.twitter.com/TYvXszKMA9

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) February 10, 2026

46
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..
Image Credit : Gemini AI

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..

నిన్న (మంగళవారం) అత్యల్పంగా మెదక్ లో 13.2, ఆదిలాబాద్ లో 13.7, రామగుండంలో 14.2, హన్మకొండలో 15, నిజామాబాద్ లో 16,4, నల్గొండలో 17.4, మహబూబ్ నగర్ లో 17.8, ఖమ్మంలో 18.6, భద్రాచలంలో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

56
హైదరాబాద్ వాతావరణ సమాచారం
Image Credit : Getty

హైదరాబాద్ వాతావరణ సమాచారం

హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా రాజేంద్రనగర్ లో 12, పటాన్ చెరులో 12.4, హయత్ నగర్ లో 15, బేగంపేటలో 16.5, హకీంపేటలో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా హకీంపేటలో 31.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ (బుధవారం) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంటుందని... అత్యధికంగా 32 డిగ్రీలు, అత్యల్పంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

REALISED WEATHER OVER TELANGANA DATED: 10.02.2026 pic.twitter.com/LleyB3E9Pq

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) February 10, 2026

66
ఏపీలో మండిపోతున్న ఎండలు
Image Credit : Asianet News

ఏపీలో మండిపోతున్న ఎండలు

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు ముదురుతున్నాయి... మరో రెండుమూడు రోజుల్లో చలి పూర్తిగా తగ్గిపోతుందని వాతావరణ శాఖ చెబుతోంది. వేసవికాలం ఇలా మొదలయ్యిందో లేదో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి... నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నరసాపురం, బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతారణమే ఉంది... గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎండల తీవ్రతను అర్థంచేసుకోవచ్చు... ఇప్పుడే ఇలా ఉంటే నడి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
విశాఖపట్నం
విజయవాడ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved