ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైరయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఇవాళ అమరావతిలో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దిశదిమ్మరిలా దేశం మొత్తం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ సొమ్ముతో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.  ముఖ్యమంత్రి విలాసాలకు, ప్రత్యేక విమానాలకు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని జీవీఎల్ దుయ్యబట్టారు. సీఎం పట్ల అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని.. అతిగా సహకరించవద్దని నరసింహారావు సూచించారు.

ప్రజాధనం దుర్వినియోగంపై గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశామన్నారు. సీఎం అందరి వద్దకు వెళ్లి దేబిరిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఏదో దోచి పెడతాడని దేశంలోని నేతలంతా ఆశపడుతున్నారని జీవీఎల్ అన్నారు. నేతలతో భేటీలో చంద్రబాబు కింద కూర్చోమన్నా.. కూర్చునేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. 

చేతనైతేనే చర్చలకు రండి: టీడీపీపై జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు

బాబుకు ఏపీలో చాలడం లేదు.. తెలంగాణ సొమ్ముపై కన్నేశారు: జీవీఎల్

చంద్రబాబుకి అది సిగ్గుగా అనిపించడం లేదా..? జీవీఎల్ స్ట్రాంగ్ కామెంట్స్

చంద్రబాబు పై మరోసారి మండిపడ్డ జీవీఎల్

మీసం మేలేసిన సీఎం రమేశ్ ఎక్కడ... బాబు ఉండేది 6 నెలలే: జీవీఎల్

లోకేష్ బినామీలే, పవన్ ప్రశ్నలకు జవాబేది: జీవీఎల్

నేను రెడీ మీరు రెడీనా: సీఎం రమేష్ కు జీవీఎల్ సవాల్

వాళ్లిద్దరూ చంద్రబాబు బినామీలు.. సీఎం రమేశ్‌ది దొంగ దీక్ష: జీవీఎల్

టీడీపీ అవినీతి బురదలో చిక్కుకొంది: ఐటీ దాడులపై జీవీఎల్

చంద్రబాబు.. రాహుల్ బాబులో.. లోకేశ్‌బాబును చూసుకుంటున్నారు: జీవీఎల్