గిరిజన యూనివర్శిటీని విజయనగరంలో ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ఎంపీ  జీవీఎల్  నరసింహారావు  చెప్పారు. 


విజయవాడ: గిరిజన యూనివర్శిటీని విజయనగరంలో ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. గిరిజన యూనివర్శిటీకి కేంద్రం గురువారం నాడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రూ. 834 కోట్లతో గిరిజన యూనివర్శిటీని కేంద్రమే నిర్మిస్తోందన్నారు. విభజన చట్టంలో 11 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇప్పటికే 10 సంస్థలను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసినట్టు ఆయన విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కేవలం ఒక్క సంస్థను మాత్రమే ఉందన్నారు.పదేళ్లలో ఏపీ విభజన చట్టంలో పొందుపర్చిన సంస్థలను కేవలం తమ ప్రభుత్వం నాలుగు ఏళ్లలోనే కేటాయించిందని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు ప్రచారం తప్ప ఏం చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చర్చల పేరుతో టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. టీడీపీ నేతలు తమను చర్చలకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పి పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చల నుండి తప్పుకొంటున్నారని జీవీఎల్ ఆరోపించారు.

మాజీ మంత్రి మాణిక్యాలరావుపై పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మెన్ బాపిరాజు ఛాలెంజ్ చేసి పోలీసులను అడ్డుపెట్టుకొని పారిపోయారని ఆయన విమర్శించారు.గతంలో కూడ బీజేవైఎం ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడ చర్చలకు సిద్దమని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తప్పించుకొన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

నిజంగా చేతనైతే చేవ ఉంటే ఎలాంటి చర్చలకైనా తాము సిద్దంగా ఉన్నామని జీవీఎల్ చెప్పారు. మాణిక్యాలరావును హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న తమను విజయవాడ బయటే అడ్డుకొన్నారని జీవీఎల్ ఆరోపించారు. 

వినాశకాలే విపరీత బుద్ది మీకు వచ్చిందని బాబుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబునాయుడు పరిపాలనను పక్కనపెట్టి.... ప్రభుత్వ సొమ్ముతో అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

బాబుకు ఏపీలో చాలడం లేదు.. తెలంగాణ సొమ్ముపై కన్నేశారు: జీవీఎల్

చంద్రబాబుకి అది సిగ్గుగా అనిపించడం లేదా..? జీవీఎల్ స్ట్రాంగ్ కామెంట్స్

చంద్రబాబు పై మరోసారి మండిపడ్డ జీవీఎల్

మీసం మేలేసిన సీఎం రమేశ్ ఎక్కడ... బాబు ఉండేది 6 నెలలే: జీవీఎల్

లోకేష్ బినామీలే, పవన్ ప్రశ్నలకు జవాబేది: జీవీఎల్

టీడీపీ అవినీతి బురదలో చిక్కుకొంది: ఐటీ దాడులపై జీవీఎల్

చంద్రబాబు.. రాహుల్ బాబులో.. లోకేశ్‌బాబును చూసుకుంటున్నారు: జీవీఎల్

చంద్రబాబు పర్యటనపై ఎంపీ జీవీఎల్ అనుమానాలు