ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శల దాడి చేశారు.

చంద్రబాబు.. రాహుల్ గాంధీలో లోకేశ్‌ను చూసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో మాకు పట్టిన శని ఇప్పుడు కాంగ్రెస్‌కు పట్టిందని.. త్రిపురలో ఎలాగైతే గెలిచామో.. తెలంగాణలోనూ అలాగే గెలుస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రధాని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు..

టీడీపీతో పొత్తు లేకపోయుంటే వల్ల రెండు రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేవారమని నరసింహారాలు అన్నారు. అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి అప్పులు చేయడం తప్పించి చంద్రబాబు చేసిందేమి లేదన్నారు.  రెండు రాష్ట్రాల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత ఎమోషనల్ డ్రామాకు తెర తీశారని విమర్శించారు

. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని జీవీఎల్ ఆరోపించారు. హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ఆయన నాలుగున్నరేళ్లలో కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారని నరసింహారాలు ఆరోపించారు.