టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దేశంలో అందరికన్నా సీనియర్ మోస్ట్ పొలిటీషన్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇవాళ చిన్నపిల్లల దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నిక్కర్లు వేసుకున్నప్పుడు ఆ నేతలంతా నిక్కర్లు వేసుకునే చిన్న పిల్లలన్నారు. ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకునే చంద్రబాబు.. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. శరద్ పవార్ నాకన్నా సీనియర్, ఫరూఖ్ అబ్ధుల్లా నాకన్నా సీనియర్ అన్నారని నరసింహారావు గుర్తు చేశారు.

తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని వదులుకుని.. 14 స్థానాల కోసం కాంగ్రెస్ పంచన చేరారని జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్రవిభజన సమయంలో.. ఆ తర్వాత కాలంలో ఏ పార్టీనైతే బాబు తిట్టారో.. అదే కాంగ్రెస్ పార్టీతో ఈనాడు పొత్తు పెట్టుకుంటున్నారని నరసింహారావు దుయ్యబట్టారు.

ఇది దేశం కోసం కాదని.. కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకేనని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పని వెనుక టీడీపీ అవినీతి ఉందని.. అక్కడి సొమ్ము చాలక, తెలంగాణలో అధికారం అందుకుని.. ఇక్కడి ప్రజల సొమ్మును కాజేయాలని బాబు చూస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనుకుంటున్న కూటమి.. ఓడిపోయిన పార్టీల కూటమిగా ఆయన అభివర్ణించారు. ఈ కూటమి బీజేపీకి పోటీ కాదని నరసింహారావు స్పష్టం చేశారు. 

చంద్రబాబుకి అది సిగ్గుగా అనిపించడం లేదా..? జీవీఎల్ స్ట్రాంగ్ కామెంట్స్

చంద్రబాబు పై మరోసారి మండిపడ్డ జీవీఎల్

మీసం మేలేసిన సీఎం రమేశ్ ఎక్కడ... బాబు ఉండేది 6 నెలలే: జీవీఎల్

లోకేష్ బినామీలే, పవన్ ప్రశ్నలకు జవాబేది: జీవీఎల్

టీడీపీ అవినీతి బురదలో చిక్కుకొంది: ఐటీ దాడులపై జీవీఎల్

చంద్రబాబు.. రాహుల్ బాబులో.. లోకేశ్‌బాబును చూసుకుంటున్నారు: జీవీఎల్

చంద్రబాబు పర్యటనపై ఎంపీ జీవీఎల్ అనుమానాలు