ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాజ్యసభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని.. ఈ ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో ప్రజలే ఇంటికి పంపుతారని జీవీఎల్ జోస్యం చెప్పారు.

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ కోరుతుంటే.. టీడీపీ మాత్రం వద్దనడం దారుణంగా ఉందని నరసింహారావు ఆరోపించారు.  తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంటున్నారు.. కేసు దర్యాప్తు వివరాలు చంద్రబాబు వద్ద ఉండటమేమిటని జీవీఎల్ ప్రశ్నించారు.

జగన్‌పై దాడి ఆయన్ను చంపడానికే అని పోలీసులు రిపోర్టులో రాశారు.. ప్రతిపక్షనేతపై దాడి జరగడం వల్ల ఎవరికి లాభం అనే దానిపైనా విచారణ జరపాలని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆంధ్రా మాల్యాలాగా మారిపోయారని ఆరోపించారు.

ఐటీ దాడుల విషయంలో మీసం మెలేసి మాట్లాడిన సీఎం రమేశ్.. రెండు రోజులుగా కనిపించడం లేదని.. ఆయన ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలని అన్నారు. కనీసం మాట్లాడాలని కోరారు... సీబీఐ ముడుపుల వ్యవహారంలోనూ సీఎం రమేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోందని నరసింహారావు ఆరోపించారు.

ఆంధ్రా విజయ్ మాల్యా సీఎం రమేష్:జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి చంద్రబాబే కారణం: లక్ష్మీపార్వతి

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం