ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు.. అఖిలేష్ యాదవ్ ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలసిందే. కాగా..దీనిపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.

‘‘ చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు ఐదేళ్లున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసువాడు. అందరికంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కి ‘బచ్చా’ అఖిలేష్ యాదవ్ చిటికెస్టే ఢిల్లీ వెళ్లడం సిగ్గు అనిపించలేదా? ఇది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా?’’ అంటూ ట్వీట్ చేశారు.