MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert : ద్రోణితో జతకట్టిన నైరుతి గాలులు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

Rain Alert : ద్రోణితో జతకట్టిన నైరుతి గాలులు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

Weather Update :  మండుటెండలు కొనసాగుతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ వారంరోజులు ఎండల తీవ్రత తక్కువగా ఉంటుంది… మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 16 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా వర్షాలే...
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా వర్షాలే...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఓ ద్రోణి కొనసాగుతోందని... దీనికి నైరుతి గాలులు తోడయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి... ఈ వారమంతా (మార్చి 15-22) ఇలాగే కురుస్తాయని హెచ్చరించింది. అంటే ఈవారం ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందన్నమాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ద్రోణి ఎఫెక్ట్...
Image Credit : X

ద్రోణి ఎఫెక్ట్...

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని... ఇవాళ (మార్చి 16న) కూడా కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, చెదురుమదురు జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

Related Articles

Related image1
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Related image2
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్
38
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న మూడురోజులు ఓవైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై కూల్ వెదర్... ఇలా విభిన్న వాతావరణం నెలకొంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని APSDMA ప్రకటించింది.

48
ప్రజలు జాగ్రత్త..
Image Credit : Getty

ప్రజలు జాగ్రత్త..

ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగుపాట్లు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్ష సమయంలో చెట్ల క్రింద అస్సలు నిలబడరాదని హెచ్చరించింది. రైతులు ఈ అకాల వర్షాలతో పంట దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ సూచించింది.

58
తెలంగగాణలో వర్షాలు
Image Credit : ANI

తెలంగగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి... ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ (మార్చి 16న) రాష్ట్రంలో ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని... సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయట. ఈ వారంరోజులు ఇదే వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

68
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..
Image Credit : X/metcentrehyd

నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..

ఇవాళ (మార్చి 16, సోమవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు కూడా ఈ వర్షాలకు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయట. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

78
నేడు హైదరాబాద్ లో వర్షం
Image Credit : Getty

నేడు హైదరాబాద్ లో వర్షం

రాజధాని నగరం హైదరాబాద్ ను కూడా వర్షాలు వదిలిపెట్టడంలేదు. నేడు శేరిలింగంపల్లి, పటాన్ చెరు, ఖైరతాబాద్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్, విద్యుత్ స్తంబాలు, చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

88
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
Image Credit : Getty

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

తెలంగాణలో మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉరుములు మెరుపులు, పిడుగులు.. బలమైన ఈదురుగాలులు... అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. మార్చి 18-19 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించారు తెలంగాణ వెదర్ మ్యాన్.

  • రైతులు తమ పంటలను వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు నుండి కాపాడుకోవాలి. ఇందుకోసం తమ పంటలను అందుబాటులో ఉన్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ లో భద్రపరచుకోవాలి.
  • వర్షం కురిసే సమయంలో పిడుగులు అధికంగా ఉంటాయి, కావున ఈ సమయంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి.
  • వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయి కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి… ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
అమరావతి
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు | AP Telangana Rain Alert
Recommended image3
Now Playing
Nara Lokesh Sensational Comments On YS Jagan | Chandrababu | Asianet News Telugu
Related Stories
Recommended image1
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Recommended image2
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved