టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌పై ఐటీ దాడుల వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కంపెనీలపై చేస్తోన్న ఐటీ దాడులను.. టీడీపీ రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు.

మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో సీఎం రమేశ్ .. చంద్రబాబు బినామీ అని తేలిపోయిందన్నారు.. బినామీ ఆస్తులు అయినందునే లోకేశ్ స్పందిస్తున్నారా అని నరసింహారావు ప్రశ్నించారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయదని ఆయన స్పష్టం చేశారు.

ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా కక్ష సాధింపు అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలపై ఐటీ దాడులు జరిగితే మెచ్చుకున్న తెలుగుదేశం నేతలు... తమపై జరిగితే మాత్రం భుజాలు తడుముకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ చంద్రబాబు బినామీలని ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ 500 కోట్ల రూపాయలు ఇచ్చిందని.. ఇదంతా అవినీతి సోమ్మని నరసింహారావు ఆరోపించారు. కడపలో ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేశ్ చేసే దొంగ దీక్షలకు ఎవరూ భయపడరని జీవీఎల్ అన్నారు.

దీక్ష చేసినందుకే కక్ష కట్టి కేంద్రప్రభుత్వం దాడులు చేయిస్తోందనడంలో ఎలాంటి నిజం లేదన్నారు.. స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చలు జరిపామని.. ఆయన సానుకూలంగా స్పందించారని జీవీఎల్ తెలిపారు.

నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

ప్రధాని మా అంతు చూస్తా అన్నారు...ముల్లుని ముల్లుతోనే తీస్తాం: సీఎం రమేశ్

దాడులు ఎందుకు..? పీఏసీ మెంబర్‌ హోదాలో అడిగిన రమేశ్.. మూడు రోజుల్లోనే ఐటీ రైడ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు