హైదరాబాద్: ఆపరేషన్ గరుడ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరో శివాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు లేఖలు రాశారు. తనకు రక్షణ కల్పించాలంటూ  హీరో శివాజీ లేఖలో కోరారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న శివాజీ దాదాపు నెలరోజుల అనంతరం ఇండియా వస్తున్నారు. 

ఈ నెల 21న అమెరికా నుంచి హైదరాబాద్ శివాజీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ  కల్పించాలంటూ లేఖలో కోరారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి జరిగిందంటూ అటు టీడీపీ ఆరోపిస్తుంది. జగన్ పై హత్యాయత్నంలో శివాజీ పాత్ర ఉందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి. గౌతం రెడ్డిలు అక్టోబర్ 30న శివాజీపై విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. శివాజీని అరెస్టు చేసి, విచారించాలని వారు డిమాండ్ చేశారు. 

చంద్రబాబు, శివాజీ కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే రోజా  ఆరోపించారు. ఈ కేసులో దొరక్కుండా ఉండేందుకు ప్లాన్ లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. 

ఇకపోతే బీజేపీ శివాజీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఆపరేషన్ గరుడ ఆపరేషన్ వడ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబు నాయుడు శివాజీతో డ్రామా ఆడిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ఎవరు అందించారో వెల్లడించాలని బిజెపి నాయకులు కన్నా లక్ష్మినారాయణ, జివీఎల్ నరసింహారావు కూడా డిమాండ్ చేస్తున్నారు.

అటు లక్ష్మీపార్వతి సైతం సినీనటుడు శివాజీని చంపేస్తారు అతడిని కాపాడుకోవాలంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. శివాజీని చంపి ఆ నేరాన్ని వైఎస్ జగన్ పై పెట్టినా పెడతారంటూ వ్యాఖ్యానించారు.  ఆమె వ్యాఖ్యలపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని స్పష్టం చేశారు. 

నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...ఆమెను చూస్తే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని శివాజీ వ్యాఖ్యానించారు.

మరోవైపు తాను పారిపోలేదని శివాజీ  స్పష్టం చేశారు.  తన కుమారుడు  ఉన్నత చదువుల కోసమే అమెరికా వచ్చినట్లు తెలిపారు. అమెరికా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. తాను కొత్తగా అమెరికా వెళ్లలేదని, 54 సార్లు అమెరికా వచ్చి వెళ్లానని ఆయన చెప్పారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

లక్ష్మీ పార్వతి కామెంట్లపై స్పందించిన హీరో శివాజీ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

మేం ఒంటరికాదు...పవన్ మాతోనే: సీపీఎం మధు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్ కి షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్..?

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట