హీరో  శివాజీకీ ప్రాణ హాని ఉందంటూ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై హీరో శివాజీ స్పందించారు. తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని స్పష్టం చేశారు. 

నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...ఆమెను చూస్తే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని శివాజీ వ్యాఖ్యానించారు.

read more news

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు