పోర్న్ సైట్లు: ఐదుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకు హైకోర్టులో చుక్కెదురు

 పోర్న్ వీడియోల విషయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకు హైకోర్టులో చుక్కెదురైంది. 
 

Andhra pradesh High court quashes SVBC emplolyees petitions lns

తిరుపతి: పోర్న్ వీడియోల విషయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకు హైకోర్టులో చుక్కెదురైంది. 

తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాల నుండి తొలగించారని ఆరోపిస్తూ ఉద్యోగాలు కోల్పోయిన  ఐదుగురు ఎస్వీబీసీ ఎంప్లాయిస్  హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏపీ హైకోర్టు విచారణ చేసింది.

ఉద్యోగుల తీరుపై హైకోర్టు జస్టిస్ సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. టీటీడీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

also read:ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ల కలకలం: ఐదుగురు ఉద్యోగుల గుర్తింపు

శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ కు స్పందనగా శతమానం భవతి లింక్ ను పంపాలి. కానీ దీనికి బదులుగా  ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపాడు.

ఈ విషయమై  టీటీడీ ఈవో, ఛైర్మెన్లకు ఆ భక్తుడు ఫిర్యాదు చేశాడు.ఈ విషయం ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన  వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ జరిపిన ఐదుగురు ఉద్యోగులను  ఎస్వీబీసీ తొలగించింది. దీంతో  ఐదుగురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios