ఏపీ ఖజానా ఖాళీ: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 29, 2019, 5:59 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

శ్రీకాకుళంలో టెన్షన్, అజ్ఞాతం వీడని కూన రవికుమార్: పోలీసుల వేట, రిమాండ్ కు అనుచరులు

బుధవారం రాత్రి శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలోని మాజీ విప్‌ కూన రవికుమార్‌ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా కూన రవికుమార్ భార్య ప్రమీల వారిని అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇంటిని ఎలా సోదాలు చేస్తారంటూ నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారు. 

 

నేను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతా: స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

కోడెల వ్యవహారంలో విచారం మాత్రం వ్యక్తపర్చగలను తప్ప ఇంక ఎక్కువ మాట్లాడదలచుకోలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కక్ష సాధింపు అంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. కక్ష సాధింపు అని ఏపీలో ఒక్క పౌరుడితో అయినా అనిపిస్తే తాను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

తప్పుడు ఆరోపణలతో క్షోభకు గురిచేయొద్దు: కోడెల

అసెంబ్లీ ఫర్నీచర్ విషయమై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తనను మానసికంగా క్షోభ పెట్టకూడదని ఆయన కోరారు. 

 

టీటీడీ బోర్డులోకి అమిత్ షా నామినీ ఆయనే: వైసిపి వ్యవస్థాపకుడు కూడా...

టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఎపి సిఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. అమిత్ షా వి. కృష్ణమూర్తి పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సిమెంట్స్ ఎండి శ్రీనివాసన్ ను కూడా బోర్డులోకి తీసుకునే అవకాశం ఉంది.

 

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంపై కేసు

టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 


కూన రవిపై తప్పుడు కేసులు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: అచ్చెన్నాయుడు వార్నింగ్

కూన రవికుమార్ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

 

వైరల్ వీడియో : భీమవరంలో 'సాహో' భారీ కటౌట్!

 రేపు శుక్రవారం భారీ ఎత్తున విడుద‌ల కానున్న' సాహో' కోసం జ‌నాలు ఇప్పటికే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరుతున్నారు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. సాహో సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో...ఆ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. 

 

'జబర్దస్త్' షో రెమ్యునరేషన్స్.. హైపర్ ఆదికే తక్కువ!

తాజాగా 'జబర్దస్త్' షో లో నటిస్తోన్న కమెడియన్ల పారితోషికాలు బయటకి వచ్చాయి. వీటితో పాటు నాగబాబు, రోజాల రెమ్యునరేషన్స్ కూడా బయటకి వచ్చాయి.

 

గిరిజనులకు జగన్ వరాలజల్లు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం కీలక హామీ

గిరిజనులకు సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. 

 

జగన్ కు షాక్: ఎపి ఖజానా ఖాళీ, దిక్కేది...

జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. ఖజానా ఖాళీ అయింది. జగన్ సర్కార్ చేపట్టిన పొదుపు మంత్రం ఖజానాను నింపుతుందా అనే సందేహం నెలకొంది.

 

'సై రా' ఈగోకి పోయి దెబ్బ తింటుందా..?

'సై రా' హిందీలో ఎంతగా ప్రమోట్ చేయాలని చూస్తున్నా ఆశించిన బజ్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు. అక్కడ సినిమా ఎంత క్లిక్ అవుతుందో తెలియని పరిస్థితి.

 

చెర్రీ ఫ్యాన్స్ పై 'వినయ విధేయ' ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ఫైర్

ఏ హీరోకు అయినా ఓవర్ సీస్ మార్కెట్ అనేది ప్రధానం గా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు మొదట్లో ఓవర్ సీస్ మార్కెట్ బాగా పూర్ . కానీ ధ్రువ, రంగస్దలంతో మంచి మార్కెట్ వచ్చింది అక్కడ.

 

హరీష్ మంచి నాయకుడు, వాడుకుని వదిలేశారు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీ బలోపేతంతోపాటు కాళేశ్వరం నిర్మాణంలో బాగా వాడుకుని వదిలేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును కావాలనే మంత్రివర్గం నుంచి తప్పించారని ఆరోపించారు. 
 

ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది...

నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

కేసీఆర్ కు విశ్వాసపాత్రుడు: సోమేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ అత్యంత సన్నిహితుడుగా మారాడు. తనకు అప్పగించిన బాధ్యతలను ఆయన సక్రమంగా నెరవేర్చి సీఎం ప్రశంసలు పొందుతున్నాడు. 

 

క్యారవాన్‌ లో కాకుండా రజనీ కొబ్బరిమట్టపై నిద్ర!

భారత్‌లో అత్యధిక ఆదాయాన్ని అందుకునే స్టార్‌గా రికార్డుల్లోకి ఎక్కినా.. తలైవాగా మన్ననలు అందుకున్నా రజనీ లాగ నిజ జీవితంలో నిరాడంబరంగా జీవించడం మాత్రం అసాధ్యం. అదే రజనీని మరింత మందికి దగ్గర చేసింది. అందుకే ఆయనను సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా గుండెల్లో దాచుకున్నారు. 

 

సాహో దెబ్బకు 'అవెంజర్స్' రికార్డ్ అవుట్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రాన్ని 1500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

 

బిగ్ బాస్ 3: శ్రీముఖిని కావాలని టార్గెట్ చేస్తున్నారని..!

బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై శ్రీముఖి బంధువులు  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

'మీటూ' వచ్చినా.. వేధింపులు తగ్గలేదు.. పాయల్ కామెంట్స్!

'ఆర్‌ఎక్స్‌ 100' విడుదల తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు చెప్పింది. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయేమోనని చెప్పిందినటి పాయల్. 

 

నైజం కింగ్ ప్రభాస్: మహేష్ - పవన్ ల కంటే హై రేంజ్ లో..

టాలీవుడ్ మార్కెట్ లో అత్యంత కీలక పాత్ర పోషించే నైజాం ఏరియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాహో సినిమా అక్కడ మొదటి రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కచ్చితంగా సినిమా ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ ను అందుకోగలదు. 

 

విద్యార్థులను పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారా...?: జగన్ పై లోకేష్ ఫైర్

ఇన్నాళ్లు మీ ఇంటిదగ్గరే 144సెక్షన్‌ అనుకున్నాం. కానీ రాష్ట్రమంతా అమలు చేస్తున్నారుగా! అంటూ సెటైర్లు వేశారు. వరదలొచ్చి ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లిపోయారంటూ విమర్శించారు. 
 

జగన్ మౌనం ప్రమాదకరం : మాజీమంత్రి గంటా వ్యాఖ్యల కలకలం

రాజధాని అమరావతిపై జగన్ మౌనం ప్రమాదకరమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రానికి దశ-దిశ నిర్ణయించేది రాజధానే అని చెప్పుకొచ్చారు. అలాంటి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి సృష్టించాయన్నారు. 

 

click me!