'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం 'వెంకీమామ', 'డిస్కో రాజా', 'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' వంటి చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో బిజీగా మారిన ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

హిందీలో సీరియళ్లు, పంజాబీలో సినిమాలు చేసినప్పుడు.. అలానే తెలుగులో 'ఆర్‌ఎక్స్‌ 100' విడుదల తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు చెప్పింది. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయేమోనని చెప్పింది. 

'మీటూ' ఉద్యమం జరుగుతున్నప్పటికీ కాస్టింగ్ కౌచ్ మాత్రం నశించలేదని.. ఇప్పటికీ వేధింపులు తగ్గడం లేదని వెల్లడించింది. 'ఆర్‌ఎక్స్‌ 100'లో బోల్డ్ గా నటించానని.. నిజ జీవితంలో కూడా అలానే ఉంటాననుకుంటే ఎలా..? అని ప్రశ్నించింది.  

అవకాశాలు ఇస్తే లైంగిక కోరికలు తీర్చే రకం తాను కాదని.. అవకాశాల కోసం రాజీ పడనని చెప్పింది. సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా వేధింపులు ఉన్నాయని  చెప్పింది. తను ఇలా ధైర్యంగా మాట్లాడడం వలన కొందరు తనతో కలిసి పని చేయాలనుకోవడం లేదని.. కొందరు తనను ద్వేషిస్తున్నట్లు చెప్పింది.