Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : భీమవరంలో 'సాహో' భారీ కటౌట్!

 రేపు శుక్రవారం భారీ ఎత్తున విడుద‌ల కానున్న' సాహో' కోసం జ‌నాలు ఇప్పటికే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరుతున్నారు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. సాహో సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో...ఆ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. 

Bhimavaram town has witnessed Full Of Saaho
Author
Hyderabad, First Published Aug 29, 2019, 12:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎక్కడ చూసినా సాహో ..సాహో..సాహో. మీడియా, సోషల్ మీడియా అంతటా ఇవే కబుర్లు. భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో హంగామా గత నాలుగు రోజులుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తోంది.  రేపు శుక్రవారం భారీ ఎత్తున విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం జ‌నాలు ఇప్పటికే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరుతున్నారు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. సాహో సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో...ఆ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. 

మరో ప్రక్క అభిమానులు ప్ర‌భాస్‌కి సంబంధించి భారీ క‌టౌట్స్ ఏర్పాటు చేస్తూ బిజీగా ఉన్నారు.  త‌మ అభిమానాన్ని చాటుకుంటూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక తాజాగా భీమ‌వ‌రంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 

క‌టౌట్స్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డ్యూడ్ అంటూ ఈ భారీ కటౌట్ వీడియోని షేర్ చేస్తున్నారు. సాహో చిత్రం దాదాపు 330 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం తొలి రోజునుంచే భారీ వ‌సూళ్ళ‌ని రాబ‌డుతుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అంటున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios