సిద్దిపేట : టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు చాలా మంచి నాయకుడు అంటూ కొనియాడారు. అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రాయపడుతుంటారని కితాబిచ్చారు. 

తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీ బలోపేతంతోపాటు కాళేశ్వరం నిర్మాణంలో బాగా వాడుకుని వదిలేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును కావాలనే మంత్రివర్గం నుంచి తప్పించారని ఆరోపించారు. 

సిద్ధిపేట జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి మిషన్‌ భగీరథ పథకంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథతో ఎలాంటి ఫలితం లేదన్నారు. మిషన్‌ భగీరథతో నీళ్లు రాకపోగా, పనుల పేరుతో మంచి రహదారులను అధ్వానంగా మార్చేశారని మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.