మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాకి యష్ రాజ్ ఫిలిమ్స్ వారి 'వార్' సినిమా అడ్డంకిగా మారింది. ఇటీవల  విడుదలైన 'వార్' సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో 'సై రా' టీంకి టెన్షన్ మొదలైంది. 'సై రా' హిందీలో ఎంతగా ప్రమోట్ చేయాలని చూస్తున్నా ఆశించిన బజ్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు. 

అక్కడ సినిమా ఎంత క్లిక్ అవుతుందో తెలియని పరిస్థితి. బాహుబలితో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమా 'సాహో' రిలీజ్ అవుతుందంటేనే బాలీవుడ్ లో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు ఇక చిరంజీవి సినిమా అంటే ఏమాత్రం క్రేజ్ వస్తుందోననే సందేహాలున్నాయి. అలాంటిది 'వార్' లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాతో పోటీకి దిగితే మాత్రం కచ్చితంగా 'సై రా'కి దెబ్బ పడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఆలోచించకుండా ఈగోకి పోయి ముందుకువెళ్తే మాత్రం సినిమాకి నష్టం కలగడం ఖాయం. కాబట్టి సినిమాని వాయిదా వేసుకొని దీపావళి, దసరా సమయానికి విడుదల చేస్తే బాగుంటుందని బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు.