ఏ హీరోకు అయినా ఓవర్ సీస్ మార్కెట్ అనేది ప్రధానం గా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు మొదట్లో ఓవర్ సీస్ మార్కెట్ బాగా పూర్ . కానీ ధ్రువ, రంగస్దలంతో మంచి మార్కెట్ వచ్చింది అక్కడ. అదే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఓవర్ సీస్ లో ట్రాక్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది. ఆ ఎఫెక్ట్  వినయ విధేయ రామ  ప్రీమియర్ షోలపైనే కాక కలెక్షన్స్ పైనా  పడింది.  అయితే ఇంతకాలం అక్కడ డిస్ట్రిబ్యూటర్ చాలా సైలెంట్ గా ఉన్నారు.

తాను ఎంత నష్టపోయినా మాట్లాడలేదు. కానీ ఆ ప్రష్టేషన్ ఇన్నేళ్లకు బయిటపడింది. చెర్రీ ఫ్యాన్స్ లో కొందరు ఇంకా వినయవిధేయరామ సినిమా లాస్ కు కారణం ఓవర్ సీస్ లో పబ్లిసిటీ చేయలేదంటూ,పూర్ ప్లానింగ్ అంటూ  పోస్ట్ లు పెడుతూ ట్రోల్ చేస్తూండటంతో మండుకొచ్చింది. దాంతో ట్విట్టర్ లో ఆ డిస్ట్రిబ్యూటర్ సైలింగ్ స్టోన్స్ ..రిప్లై ఇచ్చారు. తాము  పదిశాతం ఇన్విస్టిమెంట్ కూడా రికవరీ కాలేదని చెప్పుకొచ్చారు. తాము చాలా నష్టం వచ్చామని తమ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నే క్లోజ్ చేసామని అన్నారు. 

వరస పెట్టి చేసిన ట్వీట్స్ లో ..మేము చాలా కాలం నుంచి చూస్తు వస్తున్నాం. ఇంకా కొందరు తమ ఇష్టం వచ్చిన చెత్త భాషలో మాట్లాడుతున్నారు. ఎవరికీ డబ్బు నష్ట పోవాలని ఉండదు.  వినయ విధేయరామ సినిమా డిజాస్టర్. మేము డబ్బు నష్టపోయి..మీ చేత ట్రోల్ చేయించుకోవటానికి సిద్దంగా లేము. కంటెంట్ లేని సినిమా ఒప్పుకున్నావంటూ హీరోని అడిగే ధైర్యం లేదు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన మేము ఈ విషయంలో సిగ్గుపడుతున్నాము. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్  ఓవర్ సీస్ లో నష్టపోతున్నారు. బ్లైండ్ గేమ్ లు ఓవర్ సీస్ లో ఆగే రోజు వస్తుంది అన్నారు.